సాక్షి, ముంబయి : గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రాను ఐటీ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ అమెరికన్ టీవీ షో క్వాంటికో సిరీస్‌లోనూ నటించిన ప్రియాంక ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకుంది. 2011లో ఆమెపై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో గుర్తించిన అక్రమాలపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. అప్పట్లో ఆమె అందుకున్న విలాస వస్తువులకు సంబంధించి ఆదాయ పన్నును చెల్లించాల్సి ఉందని ఐటీ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రియాంక చోప్రా నివాసంపై 2011లో ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఎలాంటి పన్నులు చెల్లించని లగ్జరీ కారు, విలాసవంతమైన వాచ్‌లను అధికారులు గుర్తించారు. ఈ బహుమతులపై ప్రియాంకను ప్రశ్నించగా తన పెర్మామెన్స్‌కు మెచ్చి ఓ కంపెనీ తనకు రూ 40 లక్షల విలువైన ఎల్వీఎంహెచ్-ట్యాగ్ వాచ్‌ను, రూ 27 లక్షల విలువైన టొయోటా ప్రియస్ కారును బహుకరించాయని వెల్లడించినట్టు తెలిసింది. ఆమె నివాసంలో అన్నిలావాదేవీలు రాసిఉన్న డైరీని స్వాధీనం చేసుకున్న అధికారులు వాటికి వెంటనే పన్ను చెల్లించాలని కోరారు. దీనిపై ప్రియాంక ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా..వృత్తిలో భాగంగా అందుకున్న బహుమతులు ఏమైనా వాటిపై పన్ను చెల్లించాలని ఆమెను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment