
స్కూళ్లలో లైంగిక వేధింపులపై సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చిన్నారులపై పెరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాలని సుప్రీం కోర్టు కేంద్రం, రాష్ట్రాలకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఏకేసిక్రీల ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ దీనిపై విచారణ చేపట్టి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
పాఠశాలల్లో పిల్లలపట్ల లైంగిక వేధింపులు పెచ్చుమీరుతున్నా సంబంధిత స్కూళ్ల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదనీ, చట్టపరంగా వారి పాత్ర ఏమిటని పిటిషనర్ వినీత్‌ధందా ప్రశ్నించారు. పిల్లలను రక్షించాల్సిన బాధ్యత స్కూళ్ల నిర్వాహకులపై ఉందని అన్నారు.