
డీ. సంజయ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, నిజామాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు విచారణకు హాజరుకావాలని శనివారం నిజామాబాద్ పోలీసులు ఆదేశించారు. శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతనిపై కేసు నమోదైన విషయం తెలిసింది. గత వారం రోజులుగా సంజయ్ పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
తనపై ఇటీవల నమోదైన లైంగిక వేధింపులు కేసుపై ప్రభుత్వం విచారిస్తే తప్పకుండా సహారికరిస్తానని ఇటీవల ప్రకటించిన మాజీ మేయర్ పోలీసులు తప్పించుకుని తిరుగుతున్నారు. తమపై లైంగిక వేధింపుల వేధింపులకు పాల్పడ్డారని పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో అతనిపై నిర్భయ కేసుతో సహా, పలు సెక్షలపై కేసు నమోదైంది. కాగా ప్రస్తుతం అతని కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment