![Nizamabad Police Searching For DS Son Dharmapuri Sanjay - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/4/DS.jpg.webp?itok=UCsdGW2x)
నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ (ఫైల్)
సాక్షి, నిజామాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. శుక్రవారం లైంగిక వేధింపుల కేసులో పోలీసులు ఆయన్ని అరెస్టు చేయాలనుకున్న నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శనివారం కూడా ఆయన అజ్ఞాతంలోనే ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర , విజయవాడలలో పోలీసులు గాలిస్తున్నారు.
నాలుగు బృందాలుగా ఏర్పడ్డ నిజామాబాద్ పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా సంజయ్ మందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపించిన విషయం తెలిసిందే. వారి ఫిర్యాదు మేరకు ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment