![Dharmapuri Sanjay Got Bail In District Court - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/30/sanjay_0.jpg.webp?itok=q71FQluY)
నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్
సాక్షి, నిజామాబాద్ : నర్సింగ్ విద్యార్థినిలపై లైంగిక వేధింపుల కేసులో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్‌కి ఊరట లభించింది. గురువారం జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 18రోజుల పాటు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన రేపు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతి గురువారం, సోమవారం పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
లైంగిక వేధింపుల కేసులో సంజయ్‌ని అరెస్ట్ చేసి పోలీసు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడిని ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసు మాన్యువల్ తయారు చేయలేదని ఆయన పేర్కొన్న సంగతి విదితమే. అయితే తర్వాత ఈ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment