డి. సంజయ్(ఫైల్)
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ మాజీ మేయర్ డి. సంజయ్ పోలీసుల కేసు నమోదు చేశారు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై తనను ప్రభుత్వం విచారిస్తే విచారణకు తాను పూర్తి సహకారాలు అందిస్తానని చెప్పిన ఆయన తనపై పోలీసులు నిర్భయ కేసుతో పాటు పలు సెక్షన్లు నమోదు చేసిన విషయం తెలుసుకుని అజ్ఞాతనంలోకి వెళ్లిపోయారు. సంజయ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లగా అప్పటికే ఆయన పరారయ్యాడు.
పోలీసుల విచారణకు సహకరిస్తానన్న సంజయ్ వ్యాఖ్యలతో పోలీసులు ఆయనకు ఫోన్ చేయగా ఫోన్ స్వీచ్ఛాఫ్ వచ్చింది. దాంతో నిజామాబాద్‌లో ఆయన తలదాచుకునేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు గాలింపు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తీవ్రంగా శ్రమించారు. అనంతరం ఇక్కడ ఆయన లేరన్న విషయ తెలుసుకున్న పోలీస్‌లు ఆరు బృందాల్లో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు వెళ్లినట్లు తెలిసింది.
ముందస్తు బెయిల్‌కు యత్నాలు..
పోలీసులు తనను అరెస్టు చేయకుండా సంజయ్ ముందస్తు బెయిల్ కోసం అజ్ఞాతంలో ఉండే ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా ఎన్నికైనప్పటి నుంచి సంజయ్ పలు వివాదాలలో ఇరుక్కున్నారు. ఈ వివాదాలతో ఎప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కలేదు. గతంలో ఎల్లమ్మగుట్ట కాలనీవాసులు పోలీస్‌లైన్ నుంచి నడుస్తుండటంపై క్వాటర్ట్స్ ప్రహరీని మూడివేశారు. దాంతో ఎల్లమ్మగుట్ట వాసులు నిరసనకు దిగారు. అప్పటి మేయర్ సంజయ్ కాలనీవాసులకు అండగా ఉండేందుకు పోలీసులు మూసిన ప్రహరీని కూల్చివేశారు. దీనిపై అప్పటి ఎస్పీ రాజేష్ సంజయ్‌పై కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేసేందుకు యత్నించారు. అయితే సంజయ్ పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకున్నారు.
కొద్ది నెలల క్రితం ఓ కానిస్టేబుల్ సంజయ్ ఇంటికి కొద్ది దూరంలో మూత్రం చేస్తుండటంతో సంజయ్ ఆ కానిస్టేబుల్‌ను పట్టుకుని కొట్టినట్లు తెలిసింది. దీనిపై ఆ కానిస్టేబుల్ నాల్గోటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు యత్నించాడు. వెంటనే రాజ్యసభ సభ్యుడు డీఎస్ తన తనయుడు సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు కాకుండా చూశారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఇప్పుడు తనపై చేసిన లైంగిక ఆరోపణలతో నమోదు చేసిన కేసులతో పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తుగా యాంటిసిప్టరీ బెయిల్ పొందెందేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు మాత్రం ఆయన ఎక్కడున్న పట్టుకుని అరెస్టు చేసేందుకు తీవ్రంగా గాలింపు చర్యల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment