
లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో సర్వీస్ ప్రారంభమవుతుంది.
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో సర్వీస్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో సర్వీస్ బయలుదేరుతుంది. సాయంత్రం 6 గంటలకల్లా డిపోలకు మెట్రో రైళ్లు చేరుకోనున్నాయి.
కాగా, కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత లాక్‌డౌన్ గడువు నేటివరకు వరకు ఉండగా.. మరో 10 రోజులపాటు పొడిగించింది. సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. ప్రజలు ఇళ్లు, గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంటపాటు అదనంగా సమయం ఇచ్చింది.
చదవండి: Telangana: పోలీసులకు తీపికబురు
Telangana: లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు