
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లలో వికృత చేష్టలతో యువత రెచ్చిపోతున్నారు. మెట్రో స్టేషన్‌ని కేంద్రంగా చేసుకొని టిక్ టాక్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. తాజాగా నగరంలోని మెట్రో స్టేషన్‌లో ఓ యువతి హంగామా సృష్టించింది.
కాగా, హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్‌లో ఓ యువతి డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీసుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.. వీడియో కాస్తా మెట్రో అధికారుల దృష్టికి చేరింది. వీడియోపై స్పందిస్తూ.. ఈ వీడియోను ఏ స్టేషన్‌లో చేశారో గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment