
ఎయిర్ కోస్తా డిస్కౌంట్ ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ సంస్థ ఎయిర్ కోస్తా.. 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఎకానమీ, ఎకానమీ ప్లస్ క్లాస్‌లో ప్రతి టికెట్‌పై రూ.609 డిస్కౌంట్ ఇవ్వనుంది. బుకింగ్ పీరియడ్ ఆగస్టు 10 నుంచి 14 వరకు. ట్రావెల్ పీరియడ్ ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంది.