![ఎయిర్‌ఏషియా ప్రత్యేక ఆఫర్](/styles/webp/s3/article_images/2017/09/4/81463434435_625x300.jpg.webp?itok=VR-z1mQs)
ఎయిర్‌ఏషియా ప్రత్యేక ఆఫర్
బెంగళూరు: ప్రముఖ విమాన యాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇప్పటి వ రకూ 2.5 మిలియన్ల ప్రయాణికులను చేరవేసినట్లు సంస్థ ఉన్నతాధికారి అమర్ అబ్రోల్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎయిర్‌ఏషియా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. కౌలాలంపూర్ , బ్యాంకాక్, బాలి, ఫుకెట్, సింగపూర్, మెల్‌బోర్న్, అక్లాండ్ వంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి తిరుగు ప్రయాణంలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు సంస్థ పేర్కొంది. టికెట్లు బుక్ చేసుకోవడానికి ఈ నెల 18 చివరి తేదీ కాగా, ఆగస్టు 1 నుంచి నవంబరు 30 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చునని సంస్థ ప్రతినిధులు తెలిపారు.