ప్రభుత్వ ఉద్యోగులకు టాటా మోటార్స్ ఆఫర్.. | Tata Motors announces 'Trust of India' initiative for Central & State | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులకు టాటా మోటార్స్ ఆఫర్..

Published Fri, Jul 8 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

ప్రభుత్వ ఉద్యోగులకు టాటా మోటార్స్ ఆఫర్..

ప్రభుత్వ ఉద్యోగులకు టాటా మోటార్స్ ఆఫర్..

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ పేరుతో టాటా మోటార్స్ ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఉద్యోగ వర్గంలో కస్టమర్ బేస్ పెంపు లక్ష్యంగా ఈ సంస్థ ఈ ఆఫర్‌ను రూపొందించింది. టాటా మోటార్స్ పాసింజర్ కార్ల కొనుగోలుకు సంబంధించి అదనపు నగదు రాయితీలు, వారెంటీ కాలం పొడిగింపు,  మెయిన్‌టినెన్స్, యాక్ససరీస్ ప్యాకేజ్ వంటి పలు ప్రయోజనాలకు కల్పించడం ఈ ఆఫర్ ఉద్దేశం. ఈ పథకం కింద టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా ఫైనాన్స్ సదుపాయం పొందడానికి కూడా వీలుంటుంది. ఈ ఆఫర్ కంపెనీని కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందన్న విశ్వాసాన్ని పాసింజర్ వెహికిల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరేఖ్ పేర్కొన్నారు. అయితే ఈ ఆఫర్ తాజాగా ఆవిష్కరించిన టాటా టియాగోకు వర్తించదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement