మూవీ స్పైసీ.. ప్లీజ్ సీ | Hate Story With the hot star | Sakshi
Sakshi News home page

మూవీ స్పైసీ.. ప్లీజ్ సీ

Published Sat, Nov 28 2015 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

మూవీ స్పైసీ..  ప్లీజ్ సీ

మూవీ స్పైసీ.. ప్లీజ్ సీ

హేట్ స్టోరీతో హాట్‌స్టార్‌గా ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన జరీనాఖాన్ సిటీకి వచ్చింది. హీరో శర్మాన్‌జోషి తదితరులతో కలిసి సిటీలోని పలు షోరూంలలో సడన్‌గా మెరిసి మురిపించింది. బంజారాహిల్స్‌లోని సర్వీ హోటల్‌లో సందడి చేసింది.  బేగంపేట్‌లోని క్రీమ్‌స్టోన్ ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వచ్చి హీటెక్కించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘హేట్‌స్టోరీ-3’ ఒక స్పైసీ మూవీఅని చెప్పింది. ఇందులో ఫైట్స్, అఫైర్స్, థ్రిల్స్ ఇబ్బడిముబ్బడిగా ఉంటాయంది.

సినిమాకు అవసరం కాబట్టి బోల్డ్‌గా నటించానని చెప్పారు. హేట్‌స్టోరీ-1, 2లను హిట్ చేసినట్టే మూడో సీక్వెల్‌ని కూడాఆదరించాలని ప్రేక్షకుల్ని కోరారు. హీరో శర్మాన్‌జోషి మాట్లాడుతూ తనకు నచ్చిన నగరాల్లో హైదరాబాద్ ఒకటన్నారు. షూటింగ్ కోసం గతంలో నెల రోజుల పాటు ఇక్కడే ఉన్నానని  గుర్తుచేసుకున్నారు.
  - సాక్షి, వీకెండ్ ప్రతినిధి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement