కొత్త ప్రయాణం | thamanna new journey starts on web series | Sakshi
Sakshi News home page

కొత్త ప్రయాణం

Published Thu, Nov 28 2019 12:35 AM | Last Updated on Thu, Nov 28 2019 12:35 AM

thamanna new journey starts on web series - Sakshi

తమన్నా

నటిగా 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు తమన్నా. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రకరకాల పాత్రలు చేశారు. కొన్నిసార్లు స్పెషల్‌ సాంగ్స్‌ చేశారు. ఇప్పుడు నటిగా ఓ కొత్త జర్నీ ఆరంభించారని తెలిసింది. ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తూ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి తమన్నా ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. వికడన్‌ టెలీవిస్తాస్‌ నిర్మిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు తమన్నా. ఈ వెబ్‌ సిరీస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ సిరీస్‌ ఏ జానర్‌లో ఉండబోతోంది? ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనే సమాచారం బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ స్టేజ్‌లో ఉంది. ఇది కాకుండా హిందీలో ‘బోల్‌ చుడియా’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు తమన్నా. తమిళంలో ఓ సినిమా కూడా కమిట్‌ అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement