తండ్రిని కాపాడే కూతురు | Tamannaah completes her debut web series 'The Novembers story | Sakshi
Sakshi News home page

తండ్రిని కాపాడే కూతురు

Published Tue, Dec 3 2019 12:41 AM | Last Updated on Tue, Dec 3 2019 12:41 AM

Tamannaah completes her debut web series 'The Novembers story - Sakshi

తమన్నా

అనుకోకుండా ఓ క్రైమ్‌లో ఇరుక్కున్న తండ్రిని కాపాడటానికి కూతురిగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు తమన్నా. మరి ఈ క్రైమ్‌ని ఛేదించి, తన తండ్రిని నిర్దోషిగా ఎలా నిరూపిస్తారని తెలియడానికి కొంచెం టైమ్‌ ఉంది. తమన్నా తొలి ‘వెబ్‌ సిరీస్‌’ ‘ది నవంబర్స్‌ స్టోరీ’ కథ ఇది. ఇదొక క్రైమ్‌ థిల్లర్‌. తమిళంలో రూపొందుతున్న ఈ సిరీస్‌కు రామ్‌ సుబ్రమణియన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తండ్రిని కాపాడే కూతురి పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఈ సిరీస్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. ‘‘తొలి షెడ్యూల్‌ను పూర్తి చేశాం. తదుపరి షెడ్యూల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు తమన్నా. ఈ వెబ్‌ సిరీస్‌ను ఆనంద వికడన్‌ సంస్థ నిర్మిస్తోంది. హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్‌ తెలుగు, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement