
లీడింగ్ టెలికం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ మరో ఆఫర్‌ను ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. 28 రోజులపాటు చెల్లుబాటు అయ్యేలా ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన డేటా ప్లాన్ అందిస్తోంది. రోజుకి 1 జీబీ, 3జీ/4జీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాలతో ఈ ప్లాన్లను అందిస్తోంది. అయితే అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్ మార్కెట్ ప్లాన్‌మాదిరిగా కాకుండా ప్రస్తుతం, ఈ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా సర్కిల్స్‌లో ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ చెల్లుతుంది.
రూ. 198 రీచార్జ్‌పై రోజుకి 1 జీబీ డేటా 28 రోజుల వేలిడిటీ. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సెలెక్టెడ్ యూజర్లకి మాత్రమే ఇది లభ్యం . ఈ ప్లాన్‌కి అర్హులో కాదో తెలుసుకోవడానికి ఎయిర్ వినియోగదారులు మై ఎయిర్‌టెల్‌యాప్ ద్వారా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికి మై ఎయిర్‌టెల్ యాప్‌లో బెస్ట్ ఆఫర్స్ ఫర్ యూ లో రూ.198 ఆఫర్ కనిపిస్తోంది.
మరోవైపు రూ.199 రీచార్జ్‌పై అన్‌లిమిటెడ్ కాలింగ్ తోపాటు రోజుకి 1 జీబీ 4జీ డేటాను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment