
ప్రముఖ టెలికాం దిగ్గజం 'భారతి ఎయిర్‌టెల్' తన యూజర్ల కోసం సరికొత్త, సరసమైన ప్లాన్ తీసుకువచ్చింది. కేవలం రూ. 398తో అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు మాత్రమే కాకుండా.. రోజుకు 2జీబీ అపరిమిత 5జీ డేటా వంటి వాటిని పొందవచ్చు.
ఎయిర్‌టెల్ అందించిన ఈ కొత్త ప్లాన్ ద్వారా హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, పాపులర్ వెబ్ సిరీస్‌లతో సహా ప్రయాణంలో ప్రీమియం వినోదాన్ని ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. దీనితో పాటు వింక్ మ్యూజిక్ సదుపాయం కూడా ఉంది. ఈ ప్లాన్ 28 రోజులు వాలిడిటీని కలిగి ఉంది.
భారతి ఎయిర్‌టెల్ ప్రస్తుతం రోజుకు 2జీబీ డేటాతో రూ. 379 ప్లాన్ అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 30 రోజులు. అదే విధంగా రూ. 349 ప్లాన్ ద్వారా రోజుకు 1.5 జీబీ డేటా కూడా అందిస్తోంది. కాగా ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త ప్లాన్ 398 రూపాయలు. దీని ద్వారా అదనపు ఖర్చు లేకుండా నెలకు ఒక ట్యూన్‌ని సెట్ చేయడానికి అనుమతిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment