![Amazon Prime Lite Annual Subscription With Free Two Day Delivery Launched in India - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/15/amazonliteplan.jpg.webp?itok=uJWNR0LZ)
యూజర్లకు తీపికబురు చెప్పింది ఈకామర్స్ దిగ్గజం అమెజాన్. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను గురువారం దేశంలో ప్రారంభించింది. ఇప్పటివరకు దేశంలో కొంతమందికి టెస్టింగ్‌లో అందుబాటులో ఉన్న ఈ సర్వీసును ఇపుడిక అందరికీ అందిస్తోంది. అంతేకాదు రెగ్యులర్ అమెజాన ప్రైమ్ వీడియో ప్లాన్ ఫీజు 1499రూపాయలతో పోలిస్తే ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 999గా ఉండటం గమనార్హం. అంటే రూ. 500 తక్కువ.
అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్, ప్రయోజనాలు
అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలను మరింత సరసమైన ధరకు యాక్సెస్ చేయాలనుకునే కస్టమర్‌లకు ఇది చీపెస్ట్ ఆప్షన్. అమెజాన్ వెబ్‌సైట్‌లో లేదా యాప్ ద్వారా కూడా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అన్ని అమెజాన్ ఆర్డర్లపై 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.
అయితే ప్రైమ్ వీడియో మాదిరిగా గాకుండా ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌లో యాడ్స్ ఉంటాయి. ఈ ప్రకటనల వ్యవధి, ఫ్రీక్వెన్సీ వివరాలను పేర్కొన లేదు. కొన్ని పరిమితులతో ప్రైమ్ వీడియో కంటెంట్ యాక్సెస్‌తో పాటు, అదనపు ఖర్చు లేకుండా రెండు రోజుల డెలివరీల ఆప్షన్‌ను అందిస్తోంది. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు)
అలాగే ప్రైమ్ లైట్ ప్లాన్‌లో అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ అందుబాటులో ఉండవు. అమెజాన్ ప్రైమ్ లైట్‌లో ఏడాది సబ్‌స్క్రిప్షన్ మాత్రమే ఉంది. కాగా ఏడాది ప్రారంభంలో కొంతమంది వినియోగదారులతో ప్లాన్‌ను పరీక్షించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!)
Comments
Please login to add a commentAdd a comment