శాన్ ఫ్రాన్సిస్కో : యాపిల్ మ్యూజిక్, గూగుల్ ప్లే మ్యూజిక్, స్పాటిఫై లాంటి వాటికి పోటీగా అమెజాన్ తన సాంగ్స్ లైబ్రరీని పెంచుకోనుంది. దీని కోసం త్వరలోనే ఓ స్వతంత్ర మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసును అమెజాన్ ఆవిష్కరించబోతోంది. ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న ఫ్రైమ్ మ్యూజిక్ కు స్వతంత్రంగా దీన్ని తీసుకొస్తోంది. నెలకు రూ.659.83 ధరతో ఈ సర్వీసులను అందించనుంది. యాపిల్ మ్యూజిక్, గూగుల్ ప్లే మ్యూజిక్, స్పాటిఫైలకు పోటీగా అమెజాన్ ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రస్తుతం పాటలను కొనుగోలు చేయడానికి, సంగీతాన్ని ప్రసారం చేయడానికి ఏడాది సబ్ స్క్రిప్షన్ తో అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ఆఫర్ ఉంది. అయితే ఇప్పుడు తీసుకురాబోతున్న ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు ద్వారా వినియోగదారులకు ఎక్కువ మ్యూజిక్ కాటలాగ్ అందుబాటులో ఉంటుందని, ప్రస్తుతమున్న ప్రైమ్ మ్యూజిక్ కాటలాగ్ కంటే ఈ కాటలాగ్ పెద్దదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సర్వీసును వీలైనంత త్వరగా తేవాలని అమెజాన్ ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ప్రస్తుతం ఈ సర్వీసులకు లైసెన్సులు పొందడంలో అమెజాన్ బిజీగా ఉందని, ఈ వేసవికాలం తర్వాత ఈ సర్వీసును తీసుకొస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త సర్వీసు అమెజాన్, తన కస్టమర్లు ప్రతిరోజు పరస్పరం సంభాషించుకోవడానికి తోడ్పడుతుందని మాజీ మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్ జయ్ సమిత్ తెలిపారు. అదనంగా అమెజాన్ ఎకో ఓనర్స్ కు, సబ్ స్క్రైబర్స్ కు ఈ కొత్త సర్వీసు నుంచి ఎలాంటి మ్యూజిక్ నైనా ఎకో ద్వారా స్ట్రీమ్ చేసుకునే అవకాశం ఉంటుందని అధికార ప్రతినిధులు చెప్పారు. ఎకో సపోర్టుతో స్పాటిఫై మంచి మ్యూజిక్ ను వినే అనుభవాన్ని కల్పిస్తోంది. దీన్ని బాటలోనే అమెజాన్ కూడా స్పాటిఫై కు పోటీగా ఈ సర్వీసులను ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది.
మ్యూజిక్‌తో మైమరిపించనున్న అమెజాన్
Published Sat, Jun 11 2016 3:44 PM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM
Advertisement
Advertisement