music streaming service
-
స్ట్రీమింగ్ మ్యూజిక్ హవా! మ్యూజీషియన్లుగా యువత
స్ట్రీమింగ్ సర్వీస్‌ల ద్వారా మ్యూజిక్ వినడానికి ఇష్టపడుతున్న యువతరం అవే సర్వీసుల ద్వారా సంగీతంపై అవగాహన ఏర్పర్చుకుంటోంది. ఆ అవగాహనతో యువ సంగీత ప్రేమికులు, శ్రోతలు స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్, ఆడియో మ్యాక్... మొదలైన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మ్యూజిషియన్లుగా మారుతున్నారు... శ్రోతలు సంగీతం వినే విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా మార్పు వచ్చింది. ఇంటర్నెట్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది ఫోనోగ్రాఫిక్ ఇండస్ట్రీ(ఐఎఫ్‌పీఐ) చేసిన సర్వేలో 78 శాతం మంది స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా మ్యూజిక్‌ను వింటున్నట్లు తెలిసింది. అందులో యువతరం ఎక్కువ. అయితే యువతరంలో కొంతమంది సంగీతాన్ని విని ఎంజాయ్ చేయడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమను ప్రపంచానికి పరిచయం చేసుకునే వేదికలుగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుంటున్నారు. ‘మన్ మేరీ జాన్’ పాటతో అపర్ణ కుమార్ చందెల్ అలియాస్ కింగ్ ‘టాప్ 50 చార్ట్స్’లో మొదటి స్థానంలో నిలిచి వైరల్ సెన్సేషన్ అయ్యాడు. నాన్–ఫిల్మ్ ఇండియన్ మ్యూజిక్ ఆ స్థాయిలో ప్రాచుర్యం పొందడం అరుదు. అపర్ణ కుమార్ ఇప్పుడు ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫై మోస్ట్ పాపులర్ ఆర్టిస్ట్‌లలో ఒకరు. కొన్ని సంవత్సరాల క్రితం శ్రోతగా స్పాటిఫైకి దగ్గరయ్యాడు అపర్ణ కుమార్. కొత్త ఆర్టిస్ట్‌ల గురించి తెలుసుకోవడంలో, వారి నుంచి స్ఫూర్తి పొందడంలో అపర్ణ కుమార్‌కు ఉపయోగపడిన ప్లాట్‌ఫామ్‌లలో స్పాటిఫై ఒకటి. మూడు సంవత్సరాల క్రితం ఈ ర్యాపర్ తన తొలి ఆల్బమ్ ‘కార్నివాల్’తో క్రియేటర్‌గా మారాడు. అతడి ‘తు ఆకే దేఖ్లే’ పాట వైరల్‌గా మారింది. ‘స్పాటిఫై ద్వారా శ్రోతలు ఎలాంటి పాటలు వినడానికి ఇష్టపడుతున్నారో సులభంగా అవగాహన చేసుకోవచ్చు’ అంటున్నాడు అపర్ణ కుమార్. కుమార్‌కు మాత్రమే కాదు ఎంతోమంది యంగ్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌లకు స్పాటిఫైలాంటి ప్లాట్‌ఫామ్‌ల క్రియేటర్–సెంట్రిక్ అప్రోచ్ వరంలా మారింది. పెద్ద ప్రాజెక్ట్‌లు వచ్చేలా చేయడంలో, మ్యూజిక్‌ను కెరీర్ ఆప్షన్‌గా మలుచుకోవడంలో, ప్రపంచానికి వారి ప్రతిభను పరిచయం చేయడంలో స్పాటిఫైలాంటి ప్లాట్‌ఫామ్‌లు యూత్‌కు ఉపయోగపడుతున్నాయి. ‘ఒకప్పుడు యంగ్ ఆర్టిస్ట్‌లు తమ గురించి తాము తెలుసుకోలేకపోయేవారు. తమ సంగీతాన్ని వినడానికి ఎవరు ఇష్టపడుతున్నారు? ఎలాంటి సంగీతం చేయాలి? అనే విషయంలో స్పష్టత ఉండేది కాదు. ఈ పరిస్థితిలో మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు మార్పు తీసుకువచ్చాయి. స్పాటిఫై ఫర్ ఆర్టిస్ట్ యాప్ ద్వారా తమకు ఎలాంటి మ్యూజిక్ ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు... అనేది అర్థం చేసుకోవడానికి వీలవుతుంది’ అంటుంది చెన్నైకి చెందిన సంగీత ప్రేమికురాలు నిధి. ‘మ్యూజిక్ ఇండస్త్రీలో చాలా మార్పులు వచ్చాయి. బడ్డింగ్ మ్యూజిషియన్లు తమ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇప్పుడు ఎన్నో సోషల్ మీడియా అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఒకరు పాపులర్ కావడానికి సినిమా మాధ్యమమే ఏకైకమార్గం అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ హవా నడుస్తోంది. ఔత్సాహికులు తమ మ్యూజిక్ టాలెంట్‌ను పరిచయం చేసుకోవడానికి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి ఎన్నో వేదికలు ఉన్నాయి’ అంటున్నాడు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ సలీమ్ మర్చెంట్. మ్యూజిక్ కంపోజర్‌గా మంచి పేరు తెచ్చుకుంది కోల్‌కత్తాకు చెందిన అలోక దాస్‌గుప్తా. చిన్న వయసు నుంచే మ్యూజిక్ కంపోజ్ చేసేది. అయితే తాను కంపోజ్ చేసింది ఎవరికైనా వినిపించాలంటే భయంగా ఉండేది. కెనడా యార్క్ యూనివర్శిటీలో మ్యూజిక్ పెరఫార్మెన్స్ అండ్ కంపోజిషన్‌లో డిగ్రీ చేసినా తనమీద తనకు నమ్మకం కలగడానికి ఆలోక దాస్‌గుప్తాకు కొంత సమయం పట్టింది. ‘స్పాటిఫై లాంటి ప్లాట్‌ఫామ్స్ యువ ఆర్టిస్ట్‌లకు గట్టి ధైర్యాన్ని ఇస్తున్నాయి’ అంటుంది అలోకదాస్ గుప్తా. ముంబైకి చెందిన సౌమ్య శ్రీరాగకు లీడింగ్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌పై మంచి అవగాహన ఉంది. భవిష్యత్‌లో మ్యూజిషియన్‌గా రాణించాలనేది ఆమె కల. ‘నా ప్రయత్నంలో విజయం సాధిస్తానా? లేదా? అనేది తెలియదుకాని గట్టి ప్రయత్నమైతే చేయాలనుకుంటున్నాను’ అంటున్న శ్రీరాగకు ప్లే బ్యాక్ సింగర్ నికిత గాంధీ ఇచ్చిన సలహా ‘ఏదో ఒకటి రాస్తూనో, కంపోజ్ చేస్తూనో ఉండాలి. అవి బాగున్నాయా? లేదా– అనేది రెండో విషయం. ముందు మన సంతోషం కోసం చేస్తే చాలు’. సంగీతాన్ని వినే అవకాశమే కాదు విశ్లేషించే అవకాశం కూడా ఇస్తున్నాయి కొన్ని ప్లాట్‌ఫామ్స్. మ్యూజిక్ స్ట్రీమింగ్ అండ్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ‘ఆడియోమ్యాక్’ సబ్స్రైబర్లకు తమ ఫేవరెట్ ఆర్టిస్ట్‌ల ఆల్బమ్‌లను విశ్లేషించే అవకాశం ఇచ్చింది. శ్రోతలకు నచ్చేలా, మెచ్చేలా మ్యూజిక్ ఇండస్ట్రీ వ్యూహాల మాట ఎలా ఉన్నా... ప్రతి అవకాశాన్ని, ప్రతి ఫీచర్‌ని తమలోని సంగీత ప్రతిభను మెరుగు పెట్టుకోవడానికి యువతరం ఉపయోగించుకుంటుంది. వివిధ మాధ్యమాల ద్వారా ట్రెండ్స్‌ను ఫాలో కావడమే కాదు క్రియేట్ చేస్తుంది యువతరం. యంగర్ జనరేషన్ ఏం వింటుంది, దేనికి కనెక్ట్ అవుతుంది అనేదానిపై మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఫిల్మ్ మ్యూజిక్ మాత్రమే కాదు ఇండిపెండెంట్ మ్యూజిక్ వినడానికి కూడా శ్రోతలు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ మ్యూజిక్‌తో వివిధ మాధ్యమాల ద్వారా తమను తాము నిరూపించుకునే అవకాశం యువ కళాకారులకు ఉంది. – అసీస్ కౌర్, ఫేమస్ స్పాటిఫై సింగర్ఇండిపెండెంట్ మ్యూజిక్ (చదవండి: పాటే కథలా!.. సరికొత్త మ్యూజిక్ తరాన!) -
మ్యూజిక్ బిజినెస్‌కు అలీబాబా టాటా
న్యూఢిల్లీ: చైనీస్ ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్ జియామీ మ్యూజిక్‌ను వచ్చే నెల నుంచీ మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చైనా ఎంటర్టైన్మెంట్ రంగంలో భారీగా ఎదగాలని అలీబాబా తొలుత వేసిన ప్రణాళికలకు దీంతో చెక్ పడవచ్చని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబో అభిప్రాయపడింది. కార్యకలాపాల సర్దుబాటులో భాగంగా జియామీ మ్యూజిక్‌ను ఫిబ్రవరి 5 నుంచి నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. 2013లో మ్యూజిక్ యాప్‌పై అలీబాబా గ్రూప్ మిలియన్లకొద్దీ ఇన్వెస్ట్ చేసింది. తద్వారా చైనీస్ భారీ మ్యూజిక్ మార్కెట్లో ప్రవేశించింది. అయితే ప్రణాళికలు విజయవంతం కాకపోవడంతో వెనకడుగు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా మ్యూజిక్ స్ట్రీమింగ్ మార్కెట్లో జియామీ కేవలం 2 శాతం మార్కెట్ వాటాను మాత్రమే సాధించగలిగింది. వెరసి కుగో, క్యూక్యూ, కువో, నెట్ఈజ్, క్లౌడ్ మ్యూజిక్ తదితర సంస్థల వెనుక నిలిచింది. ఈ వివరాలను బీజింగ్ సంస్థ టాకింగ్ డేటా వెల్లడించింది. కాగా.. గత నెలలో చైనా నియంత్రణ సంస్థలు అలీబాబా గ్రూప్‌నకు చెందన యాంట్ గ్రూప్‌పై యాంటీట్రస్ట్ చట్టంకింద దర్యాప్తును చేపట్టిన విషయం విదితమే. -
టిక్‌టాక్ మరో సంచలనం వచ్చేసింది
సాక్షి, ముంబై: దిగ్గజ సోషల్‌మీడియా యాప్‌లకు దడ పుట్టిస్తున్న టిక్‌టాక్ మరో సంచలనానికి తెరతీసింది. ఇప్పటికే బహుళ ప్రజాదరణ పొందిన మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లకు షాకిచ్చేలా ప్రపంచంలోనే టాప్ 10 యాప్‌లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న టిక్‌టాక్ తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ ‘రెస్సో’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ భారతదేశంలో దీన్నిలాంచ్ చేసింది. కొత్త తరం సంగీత ఔత్సాహికులకోసం సరికొత్తగా దీన్ని రూపొందించామని సంస్థ వెల్లడించింది. వినియోగదారులు, సంగీత కళాకారులు సంగీతం ద్వారా కనెక్ట్ అవ్వడానికి, వారు పరస్పరం ఒకరితో ఒకరు మమేకం కావడానికి రెస్సో వీలు కల్పిస్తుందని రెస్సో ఇండియా మ్యూజిక్ కంటెంట్ అండ్ పార్ట్నర్షిప్ హెడ్ హరి నాయర్ ప్రకటించారు. ప్రేక్షకులు, వినియోగదారులు ఏమి కోరుకుంటున్నారో తెలుసు, అందుకే మెరుగైన సామాజిక స్ట్రీమింగ్ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఈ ప్లాట్‌ఫాంను తీసుకొచ్చామన్నారు. మ్యూజిక్ స్ట్రీమింగ్ పరిశ్రమలో మొదటిదనీ, ఇలాంటిది మార్కెట్లో లేదని నమ్ముతున్నామన్నారు. మ్యూజిక్ స్ట్రీమింగ్ పరిశ్రమలోమ్యూజిక్ స్ట్రీమింగ్, సోషల్ నెట్వర్కింగ్ మధ్య దీర్ఘకాలిక అంతరాన్నిపూరించేందుకు తీసుకొచ్చిన మొదటి విప్లవాత్మక యాప్ అని పేర్కొన్నారు. ఇది వినియోగదారులకు మాత్రమే పరిమితం కాకుండా కళాకారులకు కూడా విస్తరించి, శ్రోతలతో పరిచయానికి, సరికొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని తెలిపారు. అలాగే సంగీతంతో పాటు పాటలు, సాహిత్యం, వీడియోలు, ప్లేలిస్ట్ లాంటి వాటితో ‘వైబ్స్' టూల్‌ను సృష్టించుకోవచ్చు. తమ అనుభవాన్ని పంచుకోవచ్చు. ప్రతి పాటతో సాహిత్యం లిరిక్స్ ప్లే ఉంటుందనీ, తద్వారా కస్టమర్లు పాటలు పాడుకోవడానికి కూడా అనుమతిస్తుందని తెలిపారు. సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్ట్, వార్నర్ మ్యూజిక్ గ్రూప్, మెర్లిన్ అండ్ బిచ్చర్స్ గ్రూప్, టీ-సిరీస్, సారెగామా, జీ మ్యూజిక్, వైఆర్ఎఫ్ మ్యూజిక్, టైమ్స్ మ్యూజిక్, టిప్స్, వీనస్, షెమరూ, స్పీడ్ రికార్డ్స్, ఆనంద్ ఆడియో, లాహిరి మ్యూజిక్, డివో, ముజిక్ 247 లాంటి గ్లోబల్, స్థానిక, స్వతంత్ర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రెస్సో యాప్ రియల్ టైమ్ మ్యూజిక్ లిరిక్స్ ని చూపిస్తుందనీ, వినియోగదారులు వారి కామెంట్స్‌ను ఆ పాటల క్రింద పోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. టిక్‌టాక్ ఫీచర్ లాగే ఇందులో మ్యూజిక్ తో కూడిన జీఫ్ లను, వీడియోలను క్రియేట్ చేసుకునే అవకాశాన్నికూడా కల్పిస్తుంది. దీని సేవలు ఉచితం. అయితే ప్రీమియం నెలవారీ చందా ఆప్షన్లో ఆండ్రాయిడ్ కోసం రూ .99, ఐఓఎస్ రూ. 199గా ఉంది. యాడ్ ఫ్రీ స్ట్రీమింగ్, అధిక-నాణ్యత గల ఆడియో వంటి అదనపు ఫీచర్ల చందా ఆండ్రాయిడ్‌కు రూ .99, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌కు రూ .119 ధర నిర్ణయించింది. కాగా ఆపిల్ మ్యూజిక్, గానా, ప్రైమ్ మ్యూజిక్, జియోసావ్న్, స్పాటిఫై , యూట్యూబ్ మ్యూజిక్ లాంటి యాప్‌లు మార్కెట్లో తమ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. -
భారత మార్కెట్లోకి స్పాటిఫై
న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవల దిగ్గజం స్పాటిఫై తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. దేశీయంగా జియోసావన్, అమెజాన్ మ్యూజిక్, గానా తదితర సంస్థలతో ఇది పోటీపడనుంది. తమ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా స్థానిక, అంతర్జాతీయ సంగీతాన్ని ఆస్వాదించవచ్చని స్పాటిఫై ఇండియా ఎండీ అమర్జీత్ సింగ్ బాత్రా చెప్పారు. యూజర్లు కావాలనుకుంటే నెలకు రూ. 59 చెల్లించి స్పాటిఫై ప్రీమియం సేవలకు అప్‌గ్రేడ్ కావొచ్చని వివరిం చారు. ఐఎంఐ, ఐఎఫ్‌పీఐ నివేదిక ప్రకారం దేశీయంగా ఆడియో స్ట్రీమింగ్ వ్యాపార విభాగంలో సబ్స్క్రిప్షన్ ఆధారిత ఆదాయం 2017తో పోలిస్తే ప్రస్తుతం మూడింతలై రూ. 220 కోట్లకు చేరినట్లు బాత్రా పేర్కొన్నారు. స్పాటిఫైలో 4 కోట్ల పైగా భారతీయ, అంతర్జాతీయ పాటలు అందుబాటులో ఉన్నాయి. యూజర్లకు బాలీవుడ్ సహా ప్రాంతీయ పాటలు, సంగీతాన్ని అందించేందుకు జనవరిలో టి–సిరీస్ తో స్పాటిఫై ఒప్పందం కుదుర్చుకుంది. స్పాటిఫై ప్రస్తుతం 79 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. -
ప్రత్యర్థులకు పోటీగా వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్స్
సాక్షి,ముంబై : ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా తన ప్రత్యర్థులకు షాకిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టెలికాం సంచలనం రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇచ్చేలా వొడాఫోన్ ఐడియా కూడా సొంత మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. తన కస్టమర్లకు మ్యూజిక్ సర్వీసుల ద్వారా మరింత దగ్గరయ్యే ప్రణాళికలో భాగంగా కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్ యూప్‌ను ప్రవేశపెట్టనుంది. మార్కెట్ పోటీకి అనుగుణంగా అత్యుత్తమ ఫీచర్లతో ఈ యాప్ ఉండాలని వొడాఫోన్ ఐడియా సంస్థ భావిస్తోందట. ఐడియా మ్యూజిక్ యాప్‌ను తొలగించిన దాని స్థానంలో పటిష్ఠమైన యాప్ తీసుకురానుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన తుది చర్యల్లో ఉన్నామని వోడాఫోన్ ఐడియా సీఈవో బాలేశ్శర్మ వ్యాఖ్యలను ఉటంకిస్తూ లైవ్‌మింట్ రిపోర్ట్ చేసింది. కాగా మ్యూజిక్ ప్రియుల కోసం మ్యూజిక్ స్ల్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ జియో సావన్‌ను రిలయన్స్ జియో ఇటీవల ఆవిష్కరించిన తెలిసిందే. అలాగే 100మిలియన్ల యూజర్లతో భారతీ ఎయిర్‌టెల్‌కుచెందిన వింక్ మ్యూజిక్యాప్ద్వారా ఇప్పటికే తన సేవలను అందిస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఐడియా మ్యూజిక్ యాప్‌లో 3మిలియన్ల పాటలున్నట్టు గణాంకాల ద్వార తెలుస్తోంది. -
మ్యూజిక్‌తో మైమరిపించనున్న అమెజాన్
శాన్ ఫ్రాన్సిస్కో : యాపిల్ మ్యూజిక్, గూగుల్ ప్లే మ్యూజిక్, స్పాటిఫై లాంటి వాటికి పోటీగా అమెజాన్ తన సాంగ్స్ లైబ్రరీని పెంచుకోనుంది. దీని కోసం త్వరలోనే ఓ స్వతంత్ర మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసును అమెజాన్ ఆవిష్కరించబోతోంది. ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న ఫ్రైమ్ మ్యూజిక్ కు స్వతంత్రంగా దీన్ని తీసుకొస్తోంది. నెలకు రూ.659.83 ధరతో ఈ సర్వీసులను అందించనుంది. యాపిల్ మ్యూజిక్, గూగుల్ ప్లే మ్యూజిక్, స్పాటిఫైలకు పోటీగా అమెజాన్ ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రస్తుతం పాటలను కొనుగోలు చేయడానికి, సంగీతాన్ని ప్రసారం చేయడానికి ఏడాది సబ్ స్క్రిప్షన్ తో అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ఆఫర్ ఉంది. అయితే ఇప్పుడు తీసుకురాబోతున్న ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు ద్వారా వినియోగదారులకు ఎక్కువ మ్యూజిక్ కాటలాగ్ అందుబాటులో ఉంటుందని, ప్రస్తుతమున్న ప్రైమ్ మ్యూజిక్ కాటలాగ్ కంటే ఈ కాటలాగ్ పెద్దదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సర్వీసును వీలైనంత త్వరగా తేవాలని అమెజాన్ ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ప్రస్తుతం ఈ సర్వీసులకు లైసెన్సులు పొందడంలో అమెజాన్ బిజీగా ఉందని, ఈ వేసవికాలం తర్వాత ఈ సర్వీసును తీసుకొస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త సర్వీసు అమెజాన్, తన కస్టమర్లు ప్రతిరోజు పరస్పరం సంభాషించుకోవడానికి తోడ్పడుతుందని మాజీ మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్ జయ్ సమిత్ తెలిపారు. అదనంగా అమెజాన్ ఎకో ఓనర్స్ కు, సబ్ స్క్రైబర్స్ కు ఈ కొత్త సర్వీసు నుంచి ఎలాంటి మ్యూజిక్ నైనా ఎకో ద్వారా స్ట్రీమ్ చేసుకునే అవకాశం ఉంటుందని అధికార ప్రతినిధులు చెప్పారు. ఎకో సపోర్టుతో స్పాటిఫై మంచి మ్యూజిక్ ను వినే అనుభవాన్ని కల్పిస్తోంది. దీన్ని బాటలోనే అమెజాన్ కూడా స్పాటిఫై కు పోటీగా ఈ సర్వీసులను ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది.