ముంబై: ఈ కామెర్స్ దిగ్గజం అమెజాన్ అన్ని రంగాలలో దూసుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగిన నేపథ్యంలో డిజిటల్ బంగారు పెట్టుబడులను అమెజాన్ పే ఆహ్వానిస్తోంది. త్వరలోనే వినియోగదారులకు బంగారు పెట్టుబడులను ఆకర్శించే ‘గోల్డ్ వాల్ట్’ను వినియోగదారులకు అందించనుంది. సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తన కార్యాచరణ ఉంటుందని, వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇటీవల కాలంలో చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ మైపే డిజిటల్ బంగారు సేవలను అందించింది. దేశంలో పేటీఎమ్, ఫోన్‌పే, గూగుల్‌ఫే, తదతర సంస్థలు ఇది వరకు బంగారు పెట్టుబడులను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment