జియో ఎఫెక్ట్‌: ఎయిర్‌సెల్‌ మరో కొత్త ఆఫర్‌ | Jio Effect: Aircel's Rs. 333 Pack Offers 30GB Data for 30 Days With No Daily Limits | Sakshi
Sakshi News home page

జియో ఎఫెక్ట్‌: ఎయిర్‌సెల్‌ మరో కొత్త ఆఫర్‌

Published Tue, Jul 18 2017 3:07 PM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

జియో ఎఫెక్ట్‌: ఎయిర్‌సెల్‌ మరో కొత్త ఆఫర్‌ - Sakshi

జియో ఎఫెక్ట్‌: ఎయిర్‌సెల్‌ మరో కొత్త ఆఫర్‌

రిలయన్స్‌ జియో ఎఫెక్ట్‌తో ఎయిర్‌సెల్‌ మరోసారి తన కస్టమర్లకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. సోమవారం రోజు రూ.333తో కొత్త డేటా ప్లాన్‌ను తన కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. తను ఆఫర్‌ చేసే ప్లాన్‌లతో ఎంతో ఉన్నతమైన ప్లాన్‌గా దీన్ని అభివర్ణించింది. ఎయిర్‌సెల్‌ అందిస్తున్న రూ.333 ప్యాక్‌పై యూజర్లు 30జీబీ 3జీ డేటాను 30 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. అయితే దీనిపై ఎలాంటి రోజువారీ వాడక పరిమితులు లేవు. అయితే ఈ ఆఫర్‌ ప్రస్తుతం కర్ణాటక ప్రాంత ప్రజలకు మాత్రమే కంపెనీ ప్రకటించింది. ఇంకా అన్ని రాష్ట్ర కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం లేదు. 2జీ, 3జీ, 4జీ హ్యాండ్‌సెట్‌ ఉన్న ఎయిర్‌సెల్‌ కస్టమర్లందరికీ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని, ఈ డేటా ప్లాన్‌ 3జీ స్పీడుకు మాత్రమే పరిమితం చేశామని కంపెనీ తెలిపింది. 
 
ఈ-రీఛార్జ్‌ ద్వారా లేదా USSD - 121333# కు డయల్‌ చేసి ఈ కొత్త ప్లాన్‌ను యూజర్లు యాక్టివేట్‌ చేసుకోవచ్చని చెప్పింది. గత వారమే ఈ టెలికాం కంపెనీ తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల కోసం రూ.348 ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత కాలింగ్‌ సౌకర్యాన్ని 84 రోజుల పాటు అందిస్తున్నట్టు తెలిపింది. ఎయిర్‌సెల్‌ తాజాగా తీసుకొస్తున్న ఈ ప్యాక్‌లు ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌ కింద జియో ప్రకటించిన రూ.399 ప్లాన్‌కు గట్టిపోటీ ఇవ్వనున్నాయి.
 
రూ.333 ప్లాన్‌ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన కర్ణాటక ప్రాంత ఎయిర్‌సెల్‌ సర్కిల్‌ బిజినెస్‌ హెడ్‌ కన్వర్బీర్ సింగ్...తాము కొత్తగా తీసుకొచ్చిన రూ.333 డేటా రీఛార్జ్‌ ప్యాక్‌, తమ కస్టమర్లకు ఎలాంటి అవాంతరాలు లేని ఇంటర్నెట్‌ సేవలను ఎంతో ఉన్నతమైన విలువలతో అందిస్తుందని తెలిపారు. అన్వేషించలేని ప్రపంచ వీడియోలు, మ్యూజిక్‌, మూవీలు, ఎంటర్‌టైన్మెంట్‌లను ఆస్వాదించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న ఉత్తమమైన ప్లాన్‌గా చెప్పారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement