న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ సేవల సంస్థఎయిర్‌సెల్ తారిఫ్‌వార్‌లోకి మరోసారి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల దేశవ్యాప్తంగా ఉచిత ఇన్ కమింగ్ కాల్స్ అఫర్ చేసిన సంస్థ మరో ఆఫర్‌ను అందుబాటులో తెచ్చింది. రూ.50లకు పైన రీచార్జ్‌లపై 100ఎంబీ డేటా ఫ్రీ ఆఫర్ చేస్తోంది. 10 రోజుల వాటిడిటీతో రూ. 76 లకు 1 జీబీ 3జీ డేటాను అందించనుంది. అలాగే రూ.86 రీచార్జ్‌పై ఫుల్ టాక్ టైం ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు 100ఎంబీ డేటా ప్రీ.
తమ మొబైల్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకున్న యూజర్లకు ఈ స్పెషల్ డేటా మరియు కాలింగ్ ప్రయోజనాలను అందించనున్న బుధవారం జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. కస్టమర్ల డిమాండ్ పుంజుకుంటున్న నేపథ్యంలో తమ యూజర్ల కోసం ఈ వాల్యూ ఆఫర్లను లాంచ్ చేసినట్టు ఎయిర్‌సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ ప్రకటించారు. యాప్ ఆధారిత సేవల్లో భారీ విజయం సాధించామని, అలాగే కస్టమర్లకు నిరంతరాయంగా సేవల్ని అందించడంలో ఇవి సౌలభ్యంగా ఉన్నట్టు తెలిపారు. కాగా ఎయిర్‌సెల్ దేశవ్యాప్తంగా 13 సర్కిల్స్ లో 3జీ స్పెక్ట్రం సేవలను అందిస్తోంది.