Jio Effect
-
జియో ఎఫెక్ట్: బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
సాక్షి,న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నిరవధిక సమ్మకు దిగనున్నారు. అపరిష్కృతంగా వున్న తమ డిమాండ్ల సాధన కోసం బీఎస్ఎన్ఎల్ ఆఫీసర్ అసోసియేషన్లు, ఉద్యోగుల సంఘాల సమాఖ్య ఎయుఎబి నాయకత్వంలో డిసెంబరు 3నుంచి సమ్మె చేపట్టనున్నామని బిఎస్ఎన్ఎల్ యూనియన్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.. ఈ సందర్భంగా వారు రిలయన్స్ జియోపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ముకేశ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల వైఖరే సంస్థ నష్టాలకు కారణమన్నారు. ముఖ్యంగా జియోకు పోటీని నివారించే ఉద్దేశంతోనే 4జీ సేవలు అందించే 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్కు కేటాయించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. మరోవైపు 4జీ స్పెక్ట్రమ్ దక్కించుకునేందుకు ముఖేశ్ అంబానీ రిలయన్స్ జియో.. భారీ పెట్టుబడులు పెట్టి.. అతితక్కువ ధరకు సర్వీసులు అందజేస్తోందని, దీనివల్ల అనిల్ అంబానీ ఆర్కాంతోపాటు టాటా, ఎయిర్ సెల్ వంటి పెద్ద ప్రైవేట్ సంస్థలే కాక ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తీవ్రనష్టాల్లో కూరుకుపోతోందని వారు ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలను నష్టపరిచే దురుద్దేశంతోనే జియో టారిఫ్ ఎత్తుగడలు వేస్తోందనీ, ఒకసారి మార్కెట్లో పోటీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన అనంతరం జియో కస్టమర్లను భారీగా దోపీడీ చేయనుందని పేర్కొన్నాయి. ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ సహా,ఇతర ప్రధాన పోటీదారుల నష్టాలకు కారణమైన జియోకు నరేంద్ర మోదీ సర్కార్ బహిరంగంగా మద్దతు తీవ్ర ఆందోళనకలిగించే అంశమని ప్రకటించారు. పెన్షన్ కాంట్రిబ్యూషన్ పేరుతో కేంద్రం తమను దోచుకుంటోందని, తద్వారా మోదీ ప్రభుత్వం తమ స్వంత నియమాలను ఉల్లంఘించడం దారుణమని ఆరోపించాయి. ప్రతి సంవత్సరం సంస్థ నుంచి భారీ మొత్తంలో సొంతం చేసుకుంటోందని, ఇది సంస్థపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని పడేవేస్తోందని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. అంతేకాదు జియోకి వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై వేటుపడిందని దుయ్యబట్టాయి. ముఖ్యంగా మాజీ టెలికాం సెక్రటరీ జేఎస్ దీపక్ లాంటి వారు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసాయి. 4జీ స్పెక్ట్రంను తక్షణమే కేటాయించాలని, బీఎస్ఎన్ఎల్ పెన్షన్ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వ నిబంధనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది జనవరి 1వ తేది నుండి ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన సిబ్బందికి వేతన సవరణ, తదితర డిమాండ్లతో వారు సమ్మె సైరన్ మోగించనున్నారు. -
జియో ఎఫెక్ట్ : వొడాఫోన్ ''సూపర్ అవర్'' ప్లాన్స్
టెలికాం ఇండస్ట్రిలో రిలయన్స్ జియో ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. జియో తెరతీస్తున్న ధరల యుద్దానికి టెలికాం కంపెనీలు కూడా వరుసబెట్టి ఆఫర్ల మీద ఆఫర్ల కురిపిస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ తన ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ కస్టమర్లకు ప్రారంభ ధర రూ.7 నుంచి అవర్లీ అన్లిమిటెడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ''సూపర్ అవర్'' ప్లాన్ కింద వొడాఫోన్ ఈ ఆఫర్లను తమ కస్టమర్లకు పరిమిత వ్యవధిలో లాంచ్ చేసింది. ఈ ప్లాన్ల కింద అపరిమితంగా వొడాఫోన్ నుంచి వొడాఫోన్‌కు ఉచితంగా లోకల్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాక సూపర్ అవర్లీ ప్యాక్‌ల కింద అపరిమిత 3జీ, 4జీ డేటా ప్రయోజనాలు వొడాఫోన్ తన కస్టమర్లకు అందిస్తోంది. గత నెలలోనే ధన్ ధనా ధన్ ఆఫర్ కింద జియో కొత్త ప్లాన్లను ప్రకటించింది. జియో ఆ కొత్త ఆఫర్లు తీసుకురాగానే, టెలికాం దిగ్గజాలు కూడా తమ సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. సూపర్ అవర్ ఆఫర్లను యాక్టివేట్ చేసుకోవాలంటే వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లు రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే పోస్టుపెయిడ్ కస్టమర్లు అయితే సంబంధిత యూఎస్ఎస్డీకి డయల్ చేసి ఈ ప్లాన్లను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. వొడాఫోన్ సూపర్ అవర్స్ ప్యాక్స్ గురించి కొన్ని విశేషాలు... 1. గంటకు రూ.7 : ఈ ప్యాక్ కింద గంట పాటు వొడాఫోన్ టూ వొడాఫోన్ లోకల్ కాల్స్ అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. 2. గంటకు రూ.21 : ఈ ప్యాక్ కింద 4జీ, 3జీ డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. 3. గంట వ్యవధి అనేది ప్యాక్‌లు యాక్టివేట్ చేసుకునే వొడాఫోన్ సిస్టమ్స్ సమయం ప్రకారం ఉంటుందని వొడాఫోన్ ఇండియా చెప్పింది. 4. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్1 వరకు ఈ ప్యాక్‌లు అందుబాటు 5. మల్టిపుల్ రీఛార్జ్‌లపై కూడా వొడాఫోన సూపర్ అవర్ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. దీంతో ఎన్నిసార్లైనా కస్టమర్లకు ఈ ఆఫర్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు 6. ముంబై, మహారాష్ట్ర, గోవా సర్వీసు ప్రాంతాల్లో, వాయిస్ సూపర్ అవర్ ప్లాన్లు దగ్గర్లోని గంట నుంచి యాక్టివేట్‌లో ఉంటాయి. అంటే, మీరు మధ్యాహ్నం 2.45కి రీఛార్జ్ చేయించుకుంటే, 3 గంటల నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి. 7. అయితే సూపర్ అవర్ స్కీమ్ కింద ఆఫర్ చేసే 3జీ, 4జీ స్పీడ్ డేటా ప్యాక్‌లు ఆంధ్రప్రదేశ్, బిహార్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘర్ రాష్ట్రాల్లో అందుబాటులో లేవు. 8. అపరిమిత డేటా ప్యాక్‌లు వాడే కస్టమర్లకు కూడా ఇవి అందుబాటులోఉండవు. -
జియో ఎఫెక్ట్: ఎయిర్‌సెల్ మరో కొత్త ఆఫర్
రిలయన్స్ జియో ఎఫెక్ట్‌తో ఎయిర్‌సెల్ మరోసారి తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. సోమవారం రోజు రూ.333తో కొత్త డేటా ప్లాన్‌ను తన కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. తను ఆఫర్ చేసే ప్లాన్లతో ఎంతో ఉన్నతమైన ప్లాన్‌గా దీన్ని అభివర్ణించింది. ఎయిర్‌సెల్ అందిస్తున్న రూ.333 ప్యాక్‌పై యూజర్లు 30జీబీ 3జీ డేటాను 30 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. అయితే దీనిపై ఎలాంటి రోజువారీ వాడక పరిమితులు లేవు. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం కర్ణాటక ప్రాంత ప్రజలకు మాత్రమే కంపెనీ ప్రకటించింది. ఇంకా అన్ని రాష్ట్ర కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం లేదు. 2జీ, 3జీ, 4జీ హ్యాండ్సెట్ ఉన్న ఎయిర్‌సెల్ కస్టమర్లందరికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఈ డేటా ప్లాన్ 3జీ స్పీడుకు మాత్రమే పరిమితం చేశామని కంపెనీ తెలిపింది. ఈ-రీఛార్జ్ ద్వారా లేదా USSD - 121333# కు డయల్ చేసి ఈ కొత్త ప్లాన్‌ను యూజర్లు యాక్టివేట్ చేసుకోవచ్చని చెప్పింది. గత వారమే ఈ టెలికాం కంపెనీ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.348 ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని 84 రోజుల పాటు అందిస్తున్నట్టు తెలిపింది. ఎయిర్‌సెల్ తాజాగా తీసుకొస్తున్న ఈ ప్యాక్‌లు ధన్ ధనా ధన్ ఆఫర్ కింద జియో ప్రకటించిన రూ.399 ప్లాన్‌కు గట్టిపోటీ ఇవ్వనున్నాయి. రూ.333 ప్లాన్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన కర్ణాటక ప్రాంత ఎయిర్‌సెల్ సర్కిల్ బిజినెస్ హెడ్ కన్వర్బీర్ సింగ్...తాము కొత్తగా తీసుకొచ్చిన రూ.333 డేటా రీఛార్జ్ ప్యాక్, తమ కస్టమర్లకు ఎలాంటి అవాంతరాలు లేని ఇంటర్నెట్ సేవలను ఎంతో ఉన్నతమైన విలువలతో అందిస్తుందని తెలిపారు. అన్వేషించలేని ప్రపంచ వీడియోలు, మ్యూజిక్, మూవీలు, ఎంటర్టైన్మెంట్లను ఆస్వాదించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఉత్తమమైన ప్లాన్‌గా చెప్పారు. -
ఆరు రూపాయలకే అపరిమిత డేటా
ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఎఫెక్ట్ తో వొడాఫోన్ ఇటీవల ఆఫర్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఇండియా మళ్లీ సరికొత్త ఆఫర్ ను లాంచ్ చేసింది. ఆ ఆఫర్ తో గంటకు తక్కువ ధర ఆరు రూపాయలతో అపరిమిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు పేర్కొంది. సూపర్ నైట్ పేరుతో ఈ ఆఫర్ ను వొడాఫోన్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు లాంచ్ చేసింది. దీనిలో భాగంగా 29 రూపాయలతో అపరిమిత 3జీ/4జీ డేటా వాడకాన్ని, డౌన్ లోడ్స్ ను ఐదు గంటల పాటు వినియోగించుకోవచ్చు. రోజుల్లో ఏ సమయంలోనైనా ఈ ఆఫర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఈ ఆఫర్ కేవలం రాత్రి 1 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నేడు వొడాఫోన్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. '' వొడాఫోన్ సూపర్ నైట్ రిపీట్ గా కొనుగోలు చేస్తూ.. కస్టమర్లు అపరిమితంతో ప్రతి రాత్రి సూపర్ రాత్రిగా అనుభూతి పొందండి. గంటకు కేవలం ఆరు రూపాయలతో డేటాను ఎంజాయ్ చేయండి'' అని వొడాఫోన్ పేర్కొంది. ఈ వినూత్న ప్రొడక్ట్ ను లాంచ్ చేసిన తర్వాత మాట్లాడిన వొడాఫోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సందీప్ కటారియా.. సూపర్ అంబ్రిలా కింద తమ కస్టమర్లకు వొడాఫోన్ నైట్ తీసుకురావడం తాము చాలా సంతోషిస్తున్నామని, అన్ని ఇతర సూపర్ ప్రొడక్ట్ లాగానే, ఇంటర్నెట్ వాడకానికి ఉన్న ధర అడ్డంకులను ఇది తొలగిస్తుందని పేర్కొన్నారు. నేటి యువత జీవనంలో మొబైల్ ఫోన్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ సూపర్ నైట్ ప్యాక్స్ తో నామమాత్ర ధరలతో ఐదు గంటల పాటు ఎంత కావాలంటే అంత డేటా డౌనో లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సూపర్ నైట్ పై అందించే అపరిమిత డేటాతో వొడాఫోన్ ప్లే నుంచి విభిన్నమైన కంటెంట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని కూడా పేర్కొంది. డిజిటల్ చానల్స్, రిటైల్ టచ్ పాయింట్ల నుంచి ఈ సూపర్ నైట్ ప్యాక్ లను కస్టమర్లు కొనుగోలు చేసుకోవచ్చు లేదా *444*4# డయల్ చేసి కూడా కస్టమర్లు ఈ ప్యాక్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. వొడాఫోన్ సూపర్ నెట్ తో కనెక్ట్ అయిన వెంటనే ఈ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. జియో కూడా రూ.19 ప్యాక్ ను ఆఫర్ చేస్తోంది. దీనికి గట్టి పోటీగా వొడాఫోన్ ఈ ఆఫర్ ను లాంచ్ చేసింది. -
జియో ఎఫెక్ట్ : ఐడియా సూపర్ ఆఫర్
రిలయన్స్ జియో దెబ్బకు కుదేలైన కంపెనీలన్నీ పోటీపడి మరీ ఆఫర్లు ప్రకటిస్తూ ఎదురుదాడిని తీవ్రతరం చేశాయి. ఇటీవలే వొడాఫోన్ స్పెషల్ రంజాన్ ప్యాక్ లు ప్రకటించగా.. మూడో టెలికాం దిగ్గజంగా పేరున్న ఐడియా సెల్యులార్ సైతం ప్రీపెయిడ్ కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 396 రూపాయల రీఛార్జ్ ప్యాక్ పై ఎంపిక చేసిన ప్రీపెయిడ్ కస్టమర్లు 70జీబీ డేటాను వరకు అందించనున్నట్టు తెలిపింది. దీంతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్ 70 రోజుల వరకు వాలిడిటీలో ఉంటుంది. దీనికింద రోజుకు 1జీబీ డేటాను అందిస్తోంది. అంతేకాక 3జీ స్పీడు ఈ డేటాను అందించనుంది. ఈ డేటా ప్యాక్ రిలయన్స్ జియో రూ.309 కు పోటీగా ఉందని తెలుస్తోంది. ఈ కొత్త రీఛార్జ్ ప్యాక్ పై పొందే అపరిమిత కాలింగ్ సౌకర్యాలు కేవలం ఐడియా టూ ఐడియా కస్టమర్లకు మాత్రమే. ఇతర నెట్ వర్క్ లకు 3000 నిమిషాల ఎస్టీడీ, లోకల్ కాల్స్ ను అందిస్తోంది. అంటే రోజుకు 300 నిమిషాలను మాత్రమే వాడుకోవడానికి వీలుంది. ఒకవేళ ఈ పరిమితిని మించితే నిమిషానికి 30 పైసలు వసూలు చేయనున్నట్టు ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. టెలికాం మార్కెట్లో పెరుగుతున్న పోటీతో కొత్త ఆపరేటర్ జియోకు కౌంటర్ గా ఆపరేటర్లు డేటా టారిఫ్ లను ప్రకటిస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. ఇటీవలే రిలయన్స్ జియో రికార్డు సృష్టిస్తూ డేటా స్పీడులో ఆల్ స్పీడు హైలో నిలిచింది. అయితే ఐడియా ఈ ప్యాక్ పై ఎలాంటి ప్రమోషన్ చేయడం లేదు. ఒకవేళ ఈ ఆఫర్ తమ నెంబర్ కు అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడం కోసం యూజర్లు కస్టమర్ కేర్ కు కాల్ చేయాల్సిందేనట. -
జియో ఎఫెక్ట్: అపరిమిత పానీ పూరీ
-
జియో ఎఫెక్ట్: అపరిమిత పానీ పూరీ
అహ్మదాబాద్: అపరిమిత కాల్స్.. అపరిమిత డేటా అంటూ క్రేజీ సమ్మర్ ఆఫర్లతో వినియోగదారుల మనసు దోచుకుంటూ ప్రత్యర్ధి కంపెనీలకు చుక్కలు చూపెడుతోంది రిలయన్స్ జియో నెట్ వర్క్! జనంలో జియో పట్ల పెరిగిన ఆసక్తి అంతా ఇంతా కాదు.ఎక్కడ పదిమంది కలిస్తే అక్కడ చర్చ జియోపైనే సరిగ్గా ఈ క్రేజ్ నే క్యాష్ చేసుకున్నాడు గుజరాత్ పానీ పూరీ వ్యాపారి.. తన పానీ పూరీ గిరాకీ పెంచుకోవడానికి ఏకంగా జియో పానీ పూరీ ఆఫర్ నే మొదలుపెట్టాడు. గుజరాత్ లోని పోరుబందర్ కు చెందిన రవి జగదాంబ అనే పానీపూరీ వ్యాపారి రూ.100 చెల్లించి అపరిమితంగా పానీ పూరీ తినవచ్చంటున్నాడు. అంతేకాదండోయ్ మనోడు నెల ప్లాన్ కూడా అందుబాటులోకి తెచ్చాడు. రూ.1000 చెల్లించి 30 రోజులు పానీ పూరీని ఉచితంగా తినవచ్చంటున్నాడు. అయితే తనకు సాధారణంగా వచ్చేగిరాకీ కంటే జియో ఆఫర్ పెట్టాక వచ్చే గిరాకి బాగా పెరిగిదని ఈ వ్యాపారీ చెప్పుకొచ్చాడు. మన రాష్ట్రంలో కూడా ఆ మధ్య కరీంనగర్ రైస్ మిల్లర్లు జియో రైస్ అంటూ వ్యాపారం మెదలు పెట్టారు. ఇలా ప్రతి ఒక్కరు జియో ఆఫర్ ను క్యాష్ చేసుకుంటున్నారు. -
1జీబీ 3జీ డేటా ఫ్రీ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ సేవల సంస్థఎయిర్సెల్ తారిఫ్వార్లోకి మరోసారి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల దేశవ్యాప్తంగా ఉచిత ఇన్ కమింగ్ కాల్స్ అఫర్ చేసిన సంస్థ మరో ఆఫర్‌ను అందుబాటులో తెచ్చింది. రూ.50లకు పైన రీచార్జ్‌లపై 100ఎంబీ డేటా ఫ్రీ ఆఫర్ చేస్తోంది. 10 రోజుల వాటిడిటీతో రూ. 76 లకు 1 జీబీ 3జీ డేటాను అందించనుంది. అలాగే రూ.86 రీచార్జ్‌పై ఫుల్ టాక్ టైం ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు 100ఎంబీ డేటా ప్రీ. తమ మొబైల్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకున్న యూజర్లకు ఈ స్పెషల్ డేటా మరియు కాలింగ్ ప్రయోజనాలను అందించనున్న బుధవారం జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. కస్టమర్ల డిమాండ్ పుంజుకుంటున్న నేపథ్యంలో తమ యూజర్ల కోసం ఈ వాల్యూ ఆఫర్లను లాంచ్ చేసినట్టు ఎయిర్‌సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ ప్రకటించారు. యాప్ ఆధారిత సేవల్లో భారీ విజయం సాధించామని, అలాగే కస్టమర్లకు నిరంతరాయంగా సేవల్ని అందించడంలో ఇవి సౌలభ్యంగా ఉన్నట్టు తెలిపారు. కాగా ఎయిర్‌సెల్ దేశవ్యాప్తంగా 13 సర్కిల్స్ లో 3జీ స్పెక్ట్రం సేవలను అందిస్తోంది. -
కేవలం రూ.47కు 56జీబీ 4జీ డేటా
ముంబై: రిలయన్స్ జియో సంచలనమైన డేటా ఆఫర్లతో టెలికాం కంపెనీలన్నీ ఒక్క ఉదుటున కిందకి దిగొస్తున్నాయి. నార్వేకు చెందిన టెలికాం కంపెనీ టెలినార్ మంగళవారం ఓ స్పెషల్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కింద కేవలం రూ.47కు 56జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ఈ డేటా 28 రోజుల వరకు వాలిడిటీ ఉంటుందట. అయితే ఎవరైతే రోజుకు గరిష్టంగా 2జీబీ డేటాను వాడుతారో ఆ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ ప్లాన్ ను సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్ కింద 80 పైసలకే 1జీబీ డేటాను అందిస్తామని.. కానీ కండిషన్లు అప్లయ్ అవుతాయని టెలినార్ ఓ ప్రకటలో తెలిపింది. అర్హతగల యూజర్లకు టెలినార్ ఎస్ఎంఎస్ రూపంలో ఈ ప్రాసెస్‌ను పేర్కొంటోంది. అయితే ఈ ఆఫర్ అందరికాకుండా టెలినార్ ఇన్సైడ్ సర్కిళ్లకు మాత్రమే కంపెనీ అందించనుంది. టెలినార్ ప్రకటించిన ఈ ఆఫర్, రిలయన్స్ జియో కొత్తగా అమలుచేయబోతున్న రూ.303 ప్లాన్‌ను పోలి ఉందని తెలుస్తోంది. జియోను టార్గెట్ గా చేసుకుని టెలినార్ ఈ ఆఫర్ ను ప్రకటించిందట. అయితే ఈ ప్లాన్ కింద జియో మాదిరి ఉచిత వాయిస్ కాల్స్ ను టెలినార్ అందించడం లేదు. కేవలం 56జీబీ డేటాను మాత్రమే అందించనుంది. -
బాహుబలికి అంబాని సాయం నిజమేనా..?
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి 2 ట్రైలర్ చరిత్రకు తిరగరాస్తూ రికార్డ్ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. మరే భారతీయ సినిమాకు సాధ్యం కానీ స్థాయిలో 24 గంటల్లో 50 మిలియన్ల( 5 కోట్ల)కు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. అంతేకాదు లైక్స్ విషయంలో అంతర్జాతీయ చిత్రాలకు బిగ్ టార్గెట్‌ను సెట్ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక లైక్స్ సాధించిన 'అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్స్' మించి పోయింది బాహుబలి. అవెంజర్స్‌కు 5 లక్షల 16 వేల లైక్స్ వచ్చాయి. బాహుబలి 2 ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. వ్యూస్ పరంగా అవెంజర్స్‌ను బీట్ చేయలేకపోయినా.. 5 లక్షల 57 వేలకు పైగా లైక్స్ సాధించి హాలీవుడ్ సినిమాలకు సవాల్ విసిరింది. అయితే బాహుబలి ఇంతటి భారీ రికార్డ్‌లు సాధించటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మొబైల్ నెట్వర్క్ సంస్థ జియో, ఫ్రీ ఆఫర్ కారణంగానే బాహుబలికి ఈ రికార్డ్ సాధ్యమయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఫ్రీ ఆఫర్ ఈ నెలాఖరున ముగుస్తుండటంతో ఇక పై రాబోయే చిత్రాల టీజర్లు. ట్రైలర్లకు ఈ రికార్డ్‌లు సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి తెలుగు ట్రైలర్ ను ఇప్పటి వరకు రెండున్నర కోట్ల మందికి పైగా వీక్షించారు. -
జియో ఎఫెక్ట్: చైనా ఆపరేటర్లు కూడా...
-
జియో ఎఫెక్ట్: చైనా ఆపరేటర్లు కూడా...
న్యూడిల్లీ: రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉచిత కాలింగ్ సేవలు, డేటా అంటూ తారిఫ్ వార్ ను మొదలుపెట్టిన జియో బాటలోకి మిగిలిన దేశీయదిగ్గజ టెలికాం కంపెనీలు అనివార్యంగా ఎంట్రీ ఇస్తున్నాయి. ముఖ్యంగా భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి మొబైల్ ఆపరేటర్లు తమ ఖాతాదారులను వివిధ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా చైనాకు చెందిన మూడు మొబైల్ ఆపరేటర్లు దేశీయ రోమింగ్ చార్జీలు రద్దుచేయడానికి నిర్ణయించుకున్నారు. మొబైల్ ఆపరేటర్ల సంఘమైన గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్ (జీఎస్ఎంఏ) ఈ విషయాన్ని ప్రకటించింది. దేశీయ రోమింగ్ చార్జీలపై తామిచ్చిన పిలుపునకు ఈ మేరకు చైనా ప్రముఖ ఆపరేటర్ల నుండి అద్భుతమైన మద్దతు లభించిందని ప్రపంచంలో అతిపెద్ద టెలికాం మార్కెట్ అధ్యక్షుడు సునీల్ మిట్టల్ చెప్పారు. చైనా టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్, చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ కార్ప్ , చైనా యునైటెడ్ నెట్వర్క్ కమ్యునికేషన్స్ గ్రూప్ ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి ఇంటర్ ప్రావిన్స్ రోమింగ్ చార్జీలను రద్దుచేయనున్నట్టు ప్రకటించారు. బిల్లుల భారాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారుడికి సౌలభ్యంతో పాటు ప్రోత్సాహాన్ని అందివ్వనున్నట్టు తెలిపారు. ఇతరదేశాల్లోని వివిధ ఆపరేటర్లు కూడా చైనాను ఉదాహరణగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఏప్రిల్ 1 నుంచి, జియో దాని సేవలకు చార్జీలను ప్రారంభిస్తుంది. ఇవి ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ .19, పోస్ట్ పెయిడ్ వాటిని కోసం రూ 149 నుంచి ప్రారంభం. జియో ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్ ద్వారా స్పెషల ప్యాక్‌లను ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఎయిర్ టెల్ నేషనల్ రోమింగ్ చార్జీలు రద్దుకానున్నాయి. అలాగే 90 శాతం వరకు అంతర్జాతీయ రోమింగ్ ఛార్జీలు తగ్గిస్తుంది. నేషనల్ ఇన్కమింగ్ రోమింగ్ ఛార్జ్ ప్రస్తుతం ఒక నిమిషం 45పైసలుగా ఉండగా, అవుట్ గోయింగ్ కాల్స్ ఛార్జీలు రద్దుకానున్నాయి. కాగా గ్లోబల్ టెలికం పరిశ్రమ సమాఖ్య 'జీఎస్ఎంఏ' చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ దేశీయ అతి పెద్ద మొబైల్ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కు చైర్మన్ గా కూడా ఉన్నారు. గత ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించిన సునీల్ రెండేళ్లపాటు జీఎంఎస్‌ఏ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. జీఎస్‌ఎంఏకు చైర్మన్ అయిన తొలి భారతీయుడు మిట్టల్ కావడం విశేషం. -
జియో ఎఫెక్ట్ : మరో విలీనం కన్ఫార్మ్
-
జియో ఎఫెక్ట్ : మరో విలీనం కన్ఫార్మ్
ముంబై: జియో ఎఫెక్ట్‌తో టెలికాం ఇండస్ట్రీలో మరో విలీనం కన్ ఫార్మ్ అయిపోయింది. మార్కెట్ విస్తరణలో భాగంగా నార్వేకు చెందిన టెలినార్ కంపెనీ ఇండియా బిజినెస్ లను టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై భారతీ ఎయిర్ టెల్ గురువారం ఫైనల్ ప్రకటన చేసింది. టెలినార్(ఇండియా) కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను కొనుగోలుచేసేందుకు తాము టెలినార్ సౌత్ ఆసియా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఓ నిర్ణయాత్మక ఒప్పందంలోకి ప్రవేశించామని తెలిపింది. రెగ్యులేటరీ ఫైలింగ్ లో టెలినార్ ఇండియాకు సంబంధించిన ఏడు సర్కిళ్లను కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ(ఈస్ట్), యూపీ(వెస్ట్), అస్సాంలు ఈ సర్కిళ్లలో ఉన్నాయి. ఎక్కువ జన సాంద్రత కలిగిన సర్కిళ్లను కొనుగోలుచేసి, రెవెన్యూలను భారీగా పెంచుకోవాలని ఎయిర్ టెల్ భావిస్తోంది. అయితే ఎంతమొత్తంలో కొనుగోలు చేయబోతుందో, ఒక్కో షేరుకు ఎంత చెల్లించనుందో బీఎస్ఈ ఫైలింగ్ లో ఎయిర్ టెల్ తెలుపలేదు. అగ్రిమెంట్ ప్రకారం ఎయిర్ టెల్, టెలినార్ ఇండియా విలీనం అయిపోతే, టెలినార్ ఇండియా మొత్తం దాని ఆధీనంలోకి వచ్చేస్తోంది. వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఎయిర్ టెల్ పూర్తిచేయాలనుకుంటోంది. సబ్ స్క్రైబర్ బేస్ లో దూసుకెళ్తున్నాంటూ ప్రకటిస్తున్న జియోకూ ఇది షాకివ్వాలనుకుంటోంది. టెలినార్ ఇండియాను తనలో విలీనం చేసుకోవడం వల్ల ఎయిర్ టెల్ అదనంగా 52.5 మిలియన్ యూజర్లను పొందుతోంది. ప్రస్తుతం ఎయిర్ టెల్ కు 269.40 మిలియన్ సబ్స్రైబర్లు ఉన్నారు.