కేవలం రూ.47కు 56జీబీ 4జీ డేటా | Jio effect: Telenor now offers 56GB 4G data for Rs 47, conditions apply | Sakshi
Sakshi News home page

కేవలం రూ.47కు 56జీబీ 4జీ డేటా

Published Tue, Mar 28 2017 2:51 PM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

కేవలం రూ.47కు 56జీబీ 4జీ డేటా

కేవలం రూ.47కు 56జీబీ 4జీ డేటా

ముంబై: రిలయన్స్ జియో సంచలనమైన డేటా ఆఫర్లతో టెలికాం కంపెనీలన్నీ ఒక్క  ఉదుటున కిందకి దిగొస్తున్నాయి. నార్వేకు చెందిన టెలికాం కంపెనీ టెలినార్ మంగళవారం ఓ స్పెషల్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కింద కేవలం రూ.47కు 56జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ఈ డేటా 28 రోజుల వరకు వాలిడిటీ ఉంటుందట. అయితే ఎవరైతే రోజుకు గరిష్టంగా 2జీబీ డేటాను వాడుతారో ఆ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ  ప్లాన్ ను సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందని కంపెనీ ప్రకటించింది.  ఈ కొత్త ప్లాన్ కింద 80 పైసలకే 1జీబీ డేటాను అందిస్తామని.. కానీ కండిషన్లు అప్లయ్ అవుతాయని టెలినార్ ఓ ప్రకటలో తెలిపింది.
 
అర్హతగల యూజర్లకు టెలినార్ ఎస్ఎంఎస్ రూపంలో ఈ ప్రాసెస్ను పేర్కొంటోంది. అయితే ఈ ఆఫర్ అందరికాకుండా టెలినార్ ఇన్సైడ్ సర్కిళ్లకు మాత్రమే కంపెనీ అందించనుంది.  టెలినార్ ప్రకటించిన ఈ ఆఫర్, రిలయన్స్ జియో కొత్తగా అమలుచేయబోతున్న రూ.303 ప్లాన్ను పోలి ఉందని తెలుస్తోంది. జియోను టార్గెట్ గా చేసుకుని టెలినార్ ఈ ఆఫర్ ను ప్రకటించిందట. అయితే ఈ ప్లాన్ కింద జియో మాదిరి ఉచిత వాయిస్ కాల్స్ ను టెలినార్ అందించడం లేదు. కేవలం 56జీబీ డేటాను మాత్రమే అందించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement