హైదరాబాద్: జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ కొత్తగా ‘ధన్ వర్ష’ బీమా ప్లాన్‌ను (ప్లాన్ నంబర్ 866) ప్రవేశపెట్టింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని), నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, సింగిల్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్‌పాలసీ అని ఎల్‌ఐసీ ప్రకటించింది. జీవిత బీమా రక్షణ, పొదుపులను ఈ ప్లాన్‌లో భాగంగా ఆఫర్ చేస్తోంది. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే కుటుంబానికి పరిహారం చెల్లిస్తుంది.
పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే ఏక మొత్తంలో హామీ మేరకు చెల్లిస్తుంది. ఈ ప్లాన్ 2023 మార్చి వరకే అందుబాటులో ఉంటుంది. 10, 15 ఏళ్ల కాలాన్ని పాలసీ టర్మ్‌గా ఎంపిక చేసుకోవచ్చు. కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.1.25 లక్షలు కాగా, గరిష్ట మొత్తంపై పరిమితి లేదు. 3 ఏళ్ల వయసున్న చిన్నారి వయసు నుంచి ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్‌లో ఏటా గ్యారంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి. ఈ ప్లాన్‌కు అనుబంధంగా తీసుకునేందుకు ఎల్‌ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్‌ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ అందుబాటులో ఉన్నాయి.
చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!
Comments
Please login to add a commentAdd a comment