ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మేయర్ పదవిని ఆప్ చేజిక్కించుకుంది. మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. బీజేపీపై ఆప్ 34 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో, బీజేపీకి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది.
కాగా, ఢిల్లీ మేయర్‌గా ఆప్ నేత షేల్లీ ఒబెరాయ్(39) ఎన్నికయ్యారు. ఇక, మేయర్ ఎన్నికల్లో షెల్లీ ఒబెరాయ్‌కి 150 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. దీంతో, బీజేపీపై 34 ఓట్ల ఆధిక్యంతో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. అనంతరం, ఆప్ నేతలు ఒబెరాయ్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు.
గెలుపు అనంతరం షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ఈ సభను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరందరూ సభ గౌరవాన్ని కాపాడుతారని, సజావుగా జరిగేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు.
ఇక, ఆప్ గెలుపుపై ఆ పార్టీ నేతలు స్పందించారు. ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గెలిచింది. గూండాయిజం ఓడిపోయింది. ఢిల్లీ మేయర్‌గా ఎన్నికైనా షెల్లీ ఒబెరాయ్‌కు అభినందనలు. తర్వాత, అలె ఇక్బాల్ డిప్యూటీ మేయర్ అవుతారు. మోసపూరితంగా వ్వహరించి బీజేపీ మేయర్ పదవిని దక్కించుకోవాలని రాజకీయం చేసింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఆప్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 250 స్థానాలకుగానూ ఆప్ 134, బీజేపీ 104, కాంగ్రెస్ 9 వార్డులను దక్కించుకున్నాయి.
షెల్లీ ఒబెరాయ్ వివరాలు ఇవే..
షెల్లీ ఒబెరాయ్(39).. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆమె కౌన్సిలర్‌గా నెగ్గారు. ఈ క్రమంలోనే మేయర్‌గా ఎన్నికవడం విశేషం. ఇక ఆలె మొహమ్మద్ ఆరుసార్లు ఎమ్మెల్యే, ఆప్ నేత అయిన షోయబ్ ఇక్బాల్ తనయుడు. పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో ఈ ఎన్నికల్లో నెగ్గారు.
#WATCH | Aam Aadmi Party's Shelly Oberoi elected as the new mayor of Delhi. pic.twitter.com/wAd8WNUFwx
— ANI (@ANI) February 22, 2023
Comments
Please login to add a commentAdd a comment