యూఎస్‌లో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా 18 ఏళ్ల యువకుడు జైలెన్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. అమెరికాలో అర్కాన్సాస్‌లోని ఒక చిన్నపట్టణంలో తన ప్రత్యర్థిని ఓడించి మేయర్‌గా ఎన్నికైన అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఈ మేరకు స్మిత్ మంగళవారం అమెరికాలోని ఒక చిన్న పట్టణం ఎర్లేకు మేయర్‌గా ఎన్నికయ్యారు. అతను తన ప్రత్యర్థి పారిశుధ్య విభాగంలోని సూపరింటెండెంట్ నేమీ మాథ్యూస్‌ను 235 భారీ మెజార్టీ ఓట్లతో ఓడించాడు.
స్మిత్ ఈ ఏడాదే స్కూల్ నుంచి పట్టుభద్రుడయ్యాడు. అర్కాన్సాస్‌లో మిస్సిస్సిప్పి నదికి పశ్చిమాన 30 మైళ్ల దూరంలో ఉన్న ఎర్లే పట్టణంలో సుమారు 1,831 మంది జనాభా ఉంది. ప్రచారంలో స్మిత్ ప్రజా భద్రతను మెరుగుపర్చడం, పాడుబడిని గృహాలు, భవనాలను పునరుద్ధరించడం వంటి ప్రణాళికలను అభివృద్ధిపరుస్తున్నాని హామీతో ఈ మేయర్ పదవికి ఎన్నికయ్యారు.
(చదవండి: తొందరగా వెళ్లాలని పట్టాలు దాటుతోంది..సడెన్‌గా ట్రైయిన్ రావడంతో..)
Comments
Please login to add a commentAdd a comment