బ్రిటన్: ఇప్పుడు కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక మనం పాతరోజుల్లో మన జ్ఞాపకాలను చాలా మరిచిపోయాం అని చెప్పాలో లేక వదిలేశామని అనాలో తెలియదు. కానీ అప్పట్లో ఏదైనా ఒక సినిమా చూడాలన్న, పాటలు వినాలన్నా క్యాసెట్ల షాపు మీదే ఆధారపడే వాళ్లం. వీసీఆర్ కూడా అందరి దగ్గర ఉండేది కాదు. పైగా వాటిన అద్దెకు తెచ్చకుని మరి చూసే వాళ్లం .ఆ ఆనందమే వేరు ఎందుకంటే.
(చదవండి: అదో వింతైన రంగురంగుల బల్లి.. ప్లీజ్ కాపాడండి
ఒకళ్ల ఇంట్లో వీసీఆర్ ఉంటే అందులో సినిమాలు చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు కూడా వచ్చి అందరూ కలసి మాట్లాడుకుంటూ వీక్షించేవారు. ఇప్పుడు ఆ పరిస్థతి లేదు. మన పాత జ్ఞాపకాలను మరిచిపోకుండా 80ల నాటి క్యాసెట్ల నుంచి ఇప్పటి వరకు అన్ని క్యాసెట్లను సేకరించారు యూకేకి చెందిన మేయర్. తన సోంత ఇంటినే క్యాసెట్ల స్టోర్‌గా మార్చేశారు.
చివరిసారిగా 2006లో వీహెచ్‌ఎస్(వీడియో హోం సిస్టమ్) క్యాసెట్లో విడుదలైన చివరి చిత్రం "హిస్టర్ ఆప్ వైలెన్స్" . ఆ తర్వాత దాదాపు ఆ వీహెచ్‌ఎస్ / వీసీఆర్ వీడియో క్యాసెట్ల శకం ముగిసిపోయిందనే చెప్పాలి. కానీ మేయర్ క్యాసెట్ల శకం కనుమరుగైనందకు తనకు ఏమాత్రం బాధగా లేదని ఎందుకంటే లివర్‌పూల్‌లోని ఫెయిర్‌ఫీల్డ్‌లోని ఒక పాత స్టోర్ బ్లాక్‌బాస్టర్ అనేక వీడియో క్యాసెట్లనూ దాదాపు 10 వేలు సేకరించానని చెప్పాడు.
ఈ మేరకు అతను ఉద్యోగం చేసుకుంటూనే దేశమంతా తిరిగి చాలా క్యాసెట్లను సేకరిస్తానని అంటున్నాడు. అంతేకాదు నిజం చెప్పాలంటే పాతరోజుల నుండి తన ఇల్లు వీడియో క్యాసెట్లతో నిండిపోయిన పెద్ద స్టోర్‌లా ఉండేదని ప్రస్తుతం దాన్ని ఒక మ్యూజియం మార్చి అన్ని రకాల క్యాసెట్లు లభించే ప్రధాన స్టోర్‌గా మార్చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు.
(చదవండి: ప్రపంచంలోనే తొలి చైల్డ్ ఆర్టిస్ట్)
Comments
Please login to add a commentAdd a comment