హైదరాబాద్: ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జీహెచ్‌ఎంసీ పరిదిలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పడు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరో కరోనా కేసు నమోదైంది. మేయర్ పేషీలో పనిచేస్తున్న అటెండర్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిణామంతో మేయర్ ఛాంబర్‌ను సిబ్బంది మూసివేసి శానిటైజ్ చేశారు. మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి జీహెచ్ఎంసీ కమీషనర్, హైదరాబాద్ కలెక్టర్, ఇతర అధికారులతో కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు చర్చించారు.
ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లో ఒక పాజిటివ్ కేసు నమోదయింది. రెండు రోజుల క్రితం జీహెచ్‌ఎంసీలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన విషయం తెలిసిందే. కాగా జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోనే కాక అనేక ప్రభుత్వ ఆఫీసులలో కరోనా కేసులు నయోదవుతున్నాయి.
చదవండి: న్యూజిలాండ్‌తో సహా 9 దేశాల్లో జీరో కేసులు
Comments
Please login to add a commentAdd a comment