అడ్డాకుల (దేవరకద్ర): వృద్ధాప్య పింఛను తీసుకోవడానికి ఓ వృద్ధుడు మాస్క్ బదులు పిట్టగూడునే మాస్క్‌గా ధరించి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్నమునుగల్‌ఛేడ్‌కు చెందిన తొండ కుర్మన్న మేకలు కాయడంతో పాటు వ్యవసాయ పనులు చేస్తుంటాడు. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా...దేవాలయం వద్ద పింఛను పంపిణీ చేస్తున్నారని తెలుసుకుని నేరుగా పొలం నుంచి గుడి వద్దకు బయల్దేరాడు. మాస్కు ధరించి బయటకు రావాలని గ్రామంలో ప్రచారం చేయడం గుర్తుకు వచ్చి..పొలం వద్ద ఉన్న పిట్ట గూడును తీసుకుని మాస్క్‌గా ధరించి..పింఛన్ ఇచ్చే ప్రాంతానికి వచ్చారు. పింఛన్లు పంచే బీపీఎం మురళీ వృద్ధుడి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.
సూపర్ ఐడియా.. పిట్టగూడే మాస్క్..!
Published Thu, Apr 22 2021 2:43 AM | Last Updated on Thu, Apr 22 2021 3:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment