addakula mandal
-
సూపర్ ఐడియా.. పిట్టగూడే మాస్క్..!
అడ్డాకుల (దేవరకద్ర): వృద్ధాప్య పింఛను తీసుకోవడానికి ఓ వృద్ధుడు మాస్క్ బదులు పిట్టగూడునే మాస్క్‌గా ధరించి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్నమునుగల్ఛేడ్కు చెందిన తొండ కుర్మన్న మేకలు కాయడంతో పాటు వ్యవసాయ పనులు చేస్తుంటాడు. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా...దేవాలయం వద్ద పింఛను పంపిణీ చేస్తున్నారని తెలుసుకుని నేరుగా పొలం నుంచి గుడి వద్దకు బయల్దేరాడు. మాస్కు ధరించి బయటకు రావాలని గ్రామంలో ప్రచారం చేయడం గుర్తుకు వచ్చి..పొలం వద్ద ఉన్న పిట్ట గూడును తీసుకుని మాస్క్‌గా ధరించి..పింఛన్ ఇచ్చే ప్రాంతానికి వచ్చారు. పింఛన్లు పంచే బీపీఎం మురళీ వృద్ధుడి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. -
ఒక గుడిసె.. 21 పాము పిల్లలు!
అడ్డాకుల (మహబూబ్‌నగర్): ఓ పూరి గుడిసెలో మట్టిని తవ్వగా 21 పాము పిల్లలు బయటపడటం కలకలం రేపింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక భాగంలో ఉండే గుడిసెల్లో మూడు కుటుంబాలు జీవిస్తున్నాయి. అందులో బుడగజంగం చిన్న కుర్మన్న నివాసముంటున్న గుడిసెలో దుర్వాసన రావడంతో మంగళవారం ఉదయం ఓ మూలన ఉన్న మట్టిని తవ్వారు. దీంతో అందులోంచి ఒక్కొక్కటిగా పాము పిల్లలు బయటకు వచ్చాయి. మొత్తం 21 పాము పిల్లలు బయటకు రాగా, వాటిని కర్రతో కొట్టి చంపేశారు. పది రోజుల క్రితం ఇదే గుడిసెలో ఉన్న ఓ పెద్ద పామును కూడా ఇలాగే చంపేశారు. కాగా, అక్కడే ఆరుగురు చిన్నపిల్లలు ఉండగా ఎవరికీ అపాయం కలగలేదు. చదవండి: కుక్క మలవిసర్జన..దంపతులపై కేసు! -
ట్యాంకర్ బీభత్సం: ఒకరి మృతి
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం షాకాపూర్ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి సిమెంట్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. టోల్‌ప్లాజా వద్ద నగదు చెల్లించేందుకు వరుసగా ఉన్న వాహానాలకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.