Bird Nest
-
కొండకు రామదండు.. పోటెత్తిన భక్తులు
ఆషాఢ అమావాస్య సందర్భంగా ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్ కొండ మండలంలోని శ్రీరామకొండకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే కొండపైన ఉన్న రాముడి పాదాల దర్శనంకోసం బారులు తీరారు. దాదాపు 40 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. – కోయిల్‌కొండ (మహబూబ్‌నగర్ జిల్లా) ఎరువుల కోసం ఎదురుచూపులు నిర్మల్ జిల్లా లోకేశ్వరం పీఏసీఎస్ కార్యాలయం వద్ద ఆదివారం యూరియా కోసం క్యూలో రైతన్నల చెప్పులు. పచ్చని ‘గిరి’పల్లెలు ఇటీవల కురిసిన వర్షాలకు భూమాత పచ్చరంగు పులుముకుంది. చెట్లు చిగురించి కొండలు పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి ఒడిలో సేదతీరినట్లు.. కొండల నడుమ గిరి పల్లెలు ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్‌ధరి, మామిడిగూడ, లోహర గ్రామాలు ప్రకృతి ఒడిలో ఇలా దర్శనమిస్తున్నాయి. – ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ నరికినా నీడనిస్తా.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ శివారులో పోచాలు అనే రైతు పొలంలో వేపచెట్టు.. పెద్దపెద్ద కొమ్మలతో భారీగా విస్తరించింది. పంటపై నీడ పడుతుండడంతో పోచాలు ఆ చెట్టుకొమ్మలను తొలగించాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు చెట్టు మళ్లీ చిగురించింది. ఒకప్పుడు ఆ చెట్టు నీడ పంటపై పడుతుందని నరికేసిన రైతు.. ఇప్పుడు వ్యవసాయ పనులు ముగించుకొన్నాక అదే చెట్టునీడన విశ్రమిస్తున్నాడు. – సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్ గూడు కోసం ఆరాటం ఏదో పుస్తకంలో చదివి నేర్చుకున్నట్టు.. ఎవరో గురువు దగ్గర శిక్షణ పొందినంత నేర్పుతోనూ పక్షులు అందమైన గూళ్లను అల్లుకుంటాయి. సెల్ టవర్ల రేడియేషన్ ప్రభావం, ఇతరత్రా కారణాలతో పక్షి గూళ్లు ఇప్పుడు కనిపించడమే అరుదైపోయింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ చెరువు వద్ద తుమ్మ చెట్టుపై పక్షులు అల్లుకున్న గూడులివి. – సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
‘‘కుబేరుల ఇళ్లు కూడా ఇంత అందంగా ఉండవు’’
ప్రకృతిని మించిన గొప్ప డిజైనర్ లేరనేది వాస్తవం. ఈ రోజు మన కళ్ల ముందు ఆవిష్కృతమైన ఎన్నో అద్భుతాలకు ప్రకృతే ప్రేరణ. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. వీటిలో ఒకటి పక్షి గూడు. గిజిగాడు నిర్మించే గూడు చూస్తే.. గొప్ప గొప్ప ఇంజనీర్లు కూడా ఆశ్యర్చపోతారు. నేటికి కూడా ఆ టెక్నిక్ ఎవరికి అంతుచిక్కలేదంటారు. ఇప్పుడు ఇదంతా ఎదుకంటే తాజాగా ఓ బుల్లి పక్షి గూడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీన్ని చూసిన వారు ఎన్ని కోట్లు పెట్టినా.. ఎంత గొప్ప ఇంజనీర్‌ను నియమించుకున్నా ఇంత అద్భుతమైన నిర్మాణం చేయలేరు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనలు. బ్యూటెంగేబీడెన్ అనే ట్విట్టర్ యూజర్ ‘‘ప్రకృతి అందంగా ఉంది’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక మొక్కకున్న సున్నితమైన ఆకు లోపల ఓ పక్షి గూడు నిర్మించుకోవడమే కాక దానిలో గుడ్లు కూడా పెట్టింది. ఈ చిన్న గూడును మోయడం కోసం ప్రకృతే ఆ ఆకును ఇలా డిజైన్ చేసిందేమో అనేలా ఉంది. త్వరలోనే ఈ ఆకు మూడు చిన్నచిన్న పక్షి పిల్లలను చూడబోతుంది. Nature is beautiful.. pic.twitter.com/p9U4WZwgUX — Buitengebieden (@buitengebieden_) June 2, 2021 ఇక ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజనులను తెగ ఆకర్షిస్తోంది. ‘‘కాంక్రీట్ జంగిల్లో ఉండే మాకు ఇంత అద్భుతమైన దృశ్యాలు కనిపించడం చాలా చాలా అరుదు. కృత్రిమ జీవితాలకు అలవాటు పడ్డ మాకు ఈ సహజమైన అద్భుతాన్ని చూపించినందుకు ధన్యవాదాలు’’.. ‘‘నీ ఇంటి ముందు కుబేరుల రాచ సౌధాలు కూడా వేస్టే’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
సూపర్ ఐడియా.. పిట్టగూడే మాస్క్..!
అడ్డాకుల (దేవరకద్ర): వృద్ధాప్య పింఛను తీసుకోవడానికి ఓ వృద్ధుడు మాస్క్ బదులు పిట్టగూడునే మాస్క్‌గా ధరించి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్నమునుగల్ఛేడ్కు చెందిన తొండ కుర్మన్న మేకలు కాయడంతో పాటు వ్యవసాయ పనులు చేస్తుంటాడు. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా...దేవాలయం వద్ద పింఛను పంపిణీ చేస్తున్నారని తెలుసుకుని నేరుగా పొలం నుంచి గుడి వద్దకు బయల్దేరాడు. మాస్కు ధరించి బయటకు రావాలని గ్రామంలో ప్రచారం చేయడం గుర్తుకు వచ్చి..పొలం వద్ద ఉన్న పిట్ట గూడును తీసుకుని మాస్క్‌గా ధరించి..పింఛన్ ఇచ్చే ప్రాంతానికి వచ్చారు. పింఛన్లు పంచే బీపీఎం మురళీ వృద్ధుడి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. -
పక్షుల కోసం చీకట్లో గ్రామస్తులు
చెన్నై,టీ.నగర్: శివగంగై జిల్లా, కాళయర్కోవిల్ సమీపంలోని బొత్తముడిలో గ్రామస్తులు పక్షుల కోసం అంధకారంలో జీవనం సాగిస్తున్నారు. ఇక్కడున్న ఓ విద్యుత్ స్తంభం జాయింట్ బాక్స్‌లో ఓ పిచ్చుక గూడు కట్టి గుడ్లు పెట్టింది. దీన్ని గమనించిన గ్రామ యువకులు దానిని సంరక్షించేందుకు పూనుకున్నారు. రోజురోజుకీ పిచ్చుకలు ఆ స్తంభంలో అధికంగా గుడ్లు పెట్టసాగాయి. ఇలావుండగా గ్రామంలోని వీధి దీపాలను స్విచాన్ చేయాలంటే గూళ్లను తొలగించాల్సి ఉంటుంది. దీంతో 30 రోజులుగా గ్రామస్తులు చీకట్లోనే మగ్గుతున్నారు. ఈ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో గ్రామస్తులకు పలువురు ప్రశంసలందిస్తున్నారు. -
పిట్టగూడు సూప్
రూ.64వేలు (కేజీకి) సూప్‌గా చేసుకుని తినే ఈ గూళ్ల ధర ♦ కాస్తంత గడ్డకట్టిన తమ లాలాజలంతో బుల్లిపిట్టలు కట్టుకున్న గూళ్లు ఇవి. ♦ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే ఈ గూళ్లను స్విఫ్ట్‌లెట్ జాతి చిన్న పక్షులు నిర్మిస్తాయి. ♦ వీటిని తింటే శృంగార జీవితం బాగుంటుందని, ఊపిరితిత్తుల వ్యాధులు రావని, చర్మం కాంతివంతం అవుతుందని నమ్ముతారు. ♦ ఇవి తింటే వృద్ధాప్యం త్వరగా రాదని నమ్ముతారు. ♦ చైనా, హాంకాంగ్, తైవాన్‌లో ఈ గూళ్లకు డిమాండ్ ఎక్కువ. ♦ వ్యాపారం కోసం చైనాలో కాంక్రీట్ భవంతుల్లోనూ పక్షులను పెంచి అవి అక్కడే గూళ్లు కట్టేలా చేస్తున్నారు. ♦ ప్రపంచవ్యాప్తంగా ఈ గూళ్ల వ్యాపారం విలువ అక్షరాలా ఐదు బిలియన్ డాలర్లు. ♦ ఆగ్నేయాసియాలో ఈ వ్యాపారం మరింత ఎక్కువ. ♦ చీకటి గుహల్లో, కొండ అంచు దిగువన ఎక్కువగా ఉంటాయి. -
పక్షిగూడు స్ఫూర్తి.. 40 అంతస్తుల కీర్తి
వినూత్న ఆకాశహర్మ్యాన్ని చూశారా.. ఎంత వెరైటీగా ఉందో.. చైనాలోని మకావూలో దీన్ని నిర్మించనున్నారు. ఇదో హోటల్. 40 అంతస్తుల ఈ హోటల్లో మొత్తం 780 గెస్ట్ రూంలు, సూట్స్, స్కైవిల్లాలు ఉంటాయి. ప్రఖ్యాత జాహా హాదిద్ ఆర్కిటెక్ట్స్ సంస్థ ఈ డిజైన్‌ను రూపొందించింది. మెల్కో క్రౌన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ దీన్ని నిర్మిస్తోంది. బీజింగ్ ఒలింపిక్ నేషనల్ స్టేడియం బర్డ్ నెస్ట్ స్ఫూర్తితో దీని డిజైన్‌ను తయారుచేశారట. 2017లో దీని నిర్మాణం పూర్తవుతుంది.