పక్షుల కోసం చీకట్లో గ్రామస్తులు | Villagers Sacrifice Electric Power For Birds in Tamil Nadu | Sakshi
Sakshi News home page

పక్షుల కోసం చీకట్లో గ్రామస్తులు

Published Thu, Jul 23 2020 6:37 AM | Last Updated on Thu, Jul 23 2020 8:39 AM

Villagers Sacrifice Electric Power For Birds in Tamil Nadu - Sakshi

విద్యుత్‌ బాక్స్‌లో గూళ్లు కట్టుకున్న పక్షులు

చెన్నై,టీ.నగర్‌: శివగంగై జిల్లా, కాళయర్‌కోవిల్‌ సమీపంలోని బొత్తముడిలో గ్రామస్తులు పక్షుల కోసం అంధకారంలో జీవనం సాగిస్తున్నారు. ఇక్కడున్న ఓ విద్యుత్‌ స్తంభం జాయింట్‌ బాక్స్‌లో ఓ పిచ్చుక గూడు కట్టి గుడ్లు పెట్టింది. దీన్ని గమనించిన గ్రామ యువకులు దానిని సంరక్షించేందుకు పూనుకున్నారు. రోజురోజుకీ పిచ్చుకలు ఆ స్తంభంలో అధికంగా గుడ్లు పెట్టసాగాయి. ఇలావుండగా గ్రామంలోని వీధి దీపాలను స్విచాన్‌ చేయాలంటే గూళ్లను తొలగించాల్సి ఉంటుంది. దీంతో 30 రోజులుగా గ్రామస్తులు చీకట్లోనే మగ్గుతున్నారు. ఈ సమాచారం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో గ్రామస్తులకు పలువురు ప్రశంసలందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement