అన్నానగర్: గోపాలపురంలో నడుచుకుంటూ వెళ్తున్న యువతిని లైంగికంగా వేధించిన బాలుడిని పోలీసులు పట్టుకుని జువైనల్ జస్టిస్ కమిటీ ముందు హాజరు పరిచారు. చెన్నైలోని రాయపేట ప్రాంతానికి చెందిన షేర్ నాథ్ 31 సంవత్సరాల యువతి. 28వ తేదీ ఉదయం గోపాలపురం 2వ వీధిలోని తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నది. ఆ సమయంలో 15 ఏళ్ల బాలుడు సైకిల్‌పై వచ్చాడు. నడుచుకుంటూ వెళ్తున్న యువతి ఎదురుగా సైకిల్ ఆపి ఎవరూ ఊహించని సమయంలో హఠాత్తుగా లైంగిక వేధింపులకు పాల్పడి పారిపోయాడు.
దీన్ని అస్సలు ఊహించని యువతి షాక్‌కు గురైంది. ఘటనపై వెంటనే రాయపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని బట్టి బాలుడిని గుర్తించారు. షేర్‌నాథ్‌ను లైంగికంగా వేధించిన బాలుడిని పట్టుకుని విచారించగా.. ఆమెను లైంగికంగా వేధించినట్లు బాలుడు అంగీకరించాడు. అతడి నుంచి సైకిల్‌ను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు పట్టుకున్న బాలనేరస్తుడిని జువైనల్ జస్టిస్ కమిటీ ముందు హాజరుపరిచి ప్రభుత్వ అబ్జర్వేషన్ హోంకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment