ఎందుకూ పనికి రాదులే అనుకుని ఒక వృద్ధ జంట తమ దగ్గరున్న ఒక రేర్ ఆఫ్రికన్ మాస్క్‌ను చాలా తక్కువ ధరకే ఒక ఆర్ట్ డీలర్ విక్రయించారు. ఆ తరువాత ఆ డీలర్ దానికి కోట్లకు రూపాయలకు విక్రయించడంతో మోసపోయమాని గుర్తించి లబోదిబోమన్నారు. మోస పోయామంటూ కోర్టును ఆశ్రయించారు. ఫ్రాన్స్‌లోని నిమెస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
MailOnline ప్రకారం 2021లో 81 ఏళ్ల వృద్ధురాలు, ఆమె 88 ఏళ్ల భర్త ఇంటిని శుభ్రం చేస్తుండగా, పురాతన మాస్క్‌ను గుర్తించారు. పాత సామానుల అమ్ముతున్న క్రమంలోనే ఈ మాస్క్‌ను కూడా స్థానిక డీలర్‌కు 158 డాలర్లకు (రూ.13000) విక్రయించారు. అయితే ఆర్ట్ డీలర్ కొన్ని నెలల తర్వాత ఆ మాస్క్‌ను వేలం వేసి రూ.36 కోట్లు (3.6 మిలియన్ పౌండ్‌లకు విక్రయించాడు. ఈ విషయాన్ని పేపర్లలో చదివి నివ్వెరపోయారు. మాస్క్ చాలా విలువైనదని అప్పుడు తెలుసు కున్నారు. దీంతో ఆలేస్‌లోని జ్యుడిషియల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. డీలర్ తమను మోసం చేశాడని, ఉద్దేశపూర్వకంగా ఆ వస్తువు విలువ గురించి తెలిసి కూడా మౌనంగా దాన్ని ఎగరేసుకుపోయాడని వాదించారు. పాత వస్తువుల డీలర్ తమ తోటమాలితో కలిసి కుట్ర పన్నాడని కూడా వీరు ఆరోపించారు. దీనికి పరిహారంగా తమకు సుమారు 5.55 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోరుతూ డీలర్‌పై దావా వేశారు.
ఆఫ్రికన్ రహస్య సమాజంలో ఆచారాలలో ఉపయోగించే అరుదైన ఫాంగ్ మాస్క్ ఇది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ పెద్దాయన తాత ఆఫ్రికాలో కొలోనియల్ గవర్నర్‌గా ఉన్నప్పటిదని తెలుస్తోంది. "కార్బన్-14 నిపుణుడి సహాయం తీసుకున్న డీలర్, తమ తోటమాలి ద్వారా తమ కుటుంబ పూర్వీకుల వివరాలను తెలుసుకుని మాస్క్‌ను అమ్మి సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు. అయితే తాను సెకండ్ హ్యాండ్ డీలరే కానీ పురాతన వస్తువుల డీలర్‌ని కాదని కొన్నపుడు అసలు దాని విలువ తెలియదని కోర్టులో వాదించాడు. దీంతో దిగువ న్యాయస్థానం డీలర్ పక్షాన నిలిచింది. ఈ తీర్పుపై దంపతులు నవంబర్‌లో నిమ్స్‌లోని హైకోర్టును ఆశ్రయించారు. అంతే కాదు వేలం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత తోటమాలికి కూడా ఇచ్చాడని తెలిపారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఈ కుటుంబంతో రాజీ చేసుకోవాలని డీలర్ ప్రయత్నించాడు. కానీ వారి పిల్లలకు అంగీకరించకపోవడంతో ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది.
కోర్టు రికార్డుల ప్రకారం, డీలర్ ఈ మస్క్‌ను కొన్న తరువాత డ్రౌట్ ఎస్టిమేషన్ అండ్ ఫావ్ ప్యారిస్ అనే రెండు ఫ్రెంచ్ వేలం హౌసెస్ వారిని సంప్రదించాడు. దీని విలువ చాలా గొప్పదని తెలుసుకున్న డీలర్ ఆఫ్రికన్ మాస్క్ నిపుణులను సంప్రదించాడు. అలాగే మాస్ స్పెక్ట్రోమెట్రీ విశ్లేషణను , రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా దీని అసలు రేటు తెలుసుకుని మరీ మాంట్‌పెల్లియర్‌లో ఎక్కువ ధరకు వేలం వేశాడు.
కాగా ది మెట్రో న్యూస్ ప్రకారం, ఆఫ్రికా దేశానికి సంబంధించిన అరుదైన కళా ఖండం. 19వ శతాబ్దానికి చెందిన న్గిల్ మాస్క్ గాబన్‌లోని ఫాంగ్ ప్రజల వినియోగిస్తారు. వివాహాలు, అంత్యక్రియల సమయంలో ఈ మాస్క్‌ను ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో ఇలాంటి మాస్క్‌లు చాలా అరుదుగా దర్శనమిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment