వాషింగ్టన్: ప్రపంచాన్ని కోవిడ్-19 పూర్తిగా అతాలకుతలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో సుమారు 40 లక్షల మంది మరణించగా, 18. 5 కోట్ల మంది కరోనా వైరస్‌తో ఇన్‌ఫెక్ట్ అయ్యారు. కాగా పలుదేశాల్లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌లు మొదలైయ్యాయి. భారత్‌తో సహా కొన్ని దేశాలలో మూడో వేవ్ ముప్పు పొంచిఉందని పరిశోధకులు పేర్కొన్నారు. వైరస్‌ను గుర్తించడానికి మార్కెట్‌లో ఆర్‌టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్‌లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
మాస్క్‌తో వైరస్ గుర్తింపు...!
కరోనా వైరస్‌ను గుర్తించడానికి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) , హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని వైస్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్లీ ఇన్స్పైర్డ్ ఇంజనీరింగ్ పరిశోధకుల బృందం ఒక ప్రత్యేకమైన మాస్క్‌ను తయారుచేశారు. ఈ మాస్క్ ధరించడంతో కరోనా వైరస్‌ను కేవలం 90 నిమిషాల్లో పసిగట్టవచ్చునని పరిశోధన బృందం పేర్కొంది. ఈ మాస్క్‌ను బయోసెన్సర్ టెక్నాలజీనుపయోగించి అభివృద్ధి చేశారు. ఈ బృందం ప్రామాణిక కెఎన్95 మాస్క్‌కు బయోసెన్సర్‌లను ఏర్పాటుచేశారు.
ఒక వ్యక్తి శ్వాసలో వైరస్ ఉందో లేదో అనే విషయాన్ని ఈ మాస్క్ గుర్తించనుంది. కరోనా వైరస్‌ను ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌ల మాదిరిగానే కచ్చితమైన రిజల్స్ట్ వస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. వైస్ ఇన్స్టిట్యూట్ పరిశోధనా శాస్త్రవేత్త పీటర్ న్గుయెన్ మాట్లాడుతూ..ఈ మాస్క్‌తో కరోనా వైరస్ పరీక్షల వేగవంతమౌతుందని పేర్కొన్నారు. అంతేకాకుంగా కచ్చితమైన ఫలితాలు వస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment