సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ని అరికట్టేందుకు నగరానికి చెందిన తారాడిడ్డిల్ డిజిటల్ కంపెనీ ‘వోల్ఫ్ ఎయిర్ మాస్‌్క’ పేరుతో ఓ వినూత్న పరికరాన్ని తయారు చేసింది. ఇది పోర్టబుల్ డివైస్, దీని నుంచి వెలువడే అయాన్స్ ఆ ప్రదేశంలోని వైరస్‌ని, బాక్టీరియాని నిర్జీవం చేస్తాయని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ పరికరాన్ని శనివారం ప్రముఖ సినీతార అర్చనా వేద బంజారాహిల్స్‌లో ఆవిష్కరించింది.
ఈ సందర్భంగా సంస్థ ఎండీ జగదీశ్ మాట్లాడుతూ... ఈ డివైస్‌ని జనాలు అధికంగా సంచరించే షాపింగ్ మాల్స్, హాస్పిటల్, షాప్, జిమ్, ఆఫీస్ తదితర ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఇది సెకన్‌కు వంద ట్రిలియన్ నెగిటివ్ అయాన్స్‌ని విడుదల చేస్తుందన్నారు. ఈ డివైస్‌ని ఐసీఎంఆర్ పర్యవేక్షణలో పనిచేసే లే»ొరేటరీలు పరీక్షించాయని, అనుమతులు కూడా లభించాయన్నారు. అయాన్ సాంకేతికతతో పనిచేసే ఇలాంటి పరికరాన్ని తయారు చేయడం దేశంలో ఇదే మొదటిసారని జగదీశ్ తెలిపారు. మొదటి దశలో ఈ డివైస్‌ని ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేయనున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment