Archana Veda
-
వోల్ఫ్ ఎయిర్ మాస్క్‌తో వైరస్‌లకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ని అరికట్టేందుకు నగరానికి చెందిన తారాడిడ్డిల్ డిజిటల్ కంపెనీ ‘వోల్ఫ్ ఎయిర్ మాస్్క’ పేరుతో ఓ వినూత్న పరికరాన్ని తయారు చేసింది. ఇది పోర్టబుల్ డివైస్, దీని నుంచి వెలువడే అయాన్స్ ఆ ప్రదేశంలోని వైరస్‌ని, బాక్టీరియాని నిర్జీవం చేస్తాయని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ పరికరాన్ని శనివారం ప్రముఖ సినీతార అర్చనా వేద బంజారాహిల్స్‌లో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ జగదీశ్ మాట్లాడుతూ... ఈ డివైస్‌ని జనాలు అధికంగా సంచరించే షాపింగ్ మాల్స్, హాస్పిటల్, షాప్, జిమ్, ఆఫీస్ తదితర ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఇది సెకన్‌కు వంద ట్రిలియన్ నెగిటివ్ అయాన్స్ని విడుదల చేస్తుందన్నారు. ఈ డివైస్‌ని ఐసీఎంఆర్ పర్యవేక్షణలో పనిచేసే లే»ొరేటరీలు పరీక్షించాయని, అనుమతులు కూడా లభించాయన్నారు. అయాన్ సాంకేతికతతో పనిచేసే ఇలాంటి పరికరాన్ని తయారు చేయడం దేశంలో ఇదే మొదటిసారని జగదీశ్ తెలిపారు. మొదటి దశలో ఈ డివైస్‌ని ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేయనున్నామన్నారు. -
ట్రైలర్ చాలా బాగుంది
‘‘అవలంబిక’ ట్రైలర్ చాలా బాగుంది. రాజశేఖర్ చాలా కష్టపడి ఈ సినిమాని చేశాడని తెలుస్తోంది. యువ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుంది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారు’ అని నటుడు, నిర్మాత నాగబాబు అన్నారు. సుజయ్, అర్చన (వేద) జంటగా రాజశేఖర్ (రాజ్) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అవలంబిక’. శ్రీ షిరిడీ సాయి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై జి.శ్రీనివాస్ గౌడ్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని నాగబాబు విడుదల చేశారు. ‘‘ఈ సినిమాని భారీ గ్రాఫిక్స్‌తో చిత్రీకరించాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు రాజశేఖర్. ‘‘ఖర్చుకు వెనకాడకుండా గ్రాండ్‌గా ఈ చిత్రం నిర్మించాం’’ అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుజయ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకీ పెద్దాడ, సంగీతం: ఉదయ్ కిరణ్. -
ఘనంగా జరిగిన నటి అర్చన పెళ్లి
-
కథకు తగ్గ టైటిల్
‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ’ చిత్రాల తర్వాత సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వికెజి’. (వజ్రకవచధర గోవింద). అరుణ్ పవార్ దర్శకత్వం వహించారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 6న సినిమాని విడుదల చేయనున్నారు. అరుణ్ పవార్ మాట్లాడుతూ– ‘‘సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ మా సినిమాలో ఉంటాయి. తన బాడీలాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్గా సూటయ్యే కథ ఇది. కథ డిమాండ్ మేరకే ‘వజ్రకవచధర గోవింద’ అనే టైటిల్ పెట్టాం. ఫన్నీ దొంగకు, ‘వికెజి’ టైటిల్‌కు సంబంధమేంటనే అంశం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది’’ అన్నారు. నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘అరుణ్ పవార్–సప్తగిరి కాంబినేషన్లో వచ్చిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా మా ‘వికెజి’ ఉంటుంది. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. విజయ్ బుల్గానిన్ సంగీతం సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. త్వరలోనే పాటల్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. వైభవీ జోషీ, అర్చనా వేద, ‘టెంపర్’ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు. -
నా చిరకాల వాంఛ అది.. : వేద
అందం, అభినయం, నాట్యం... వెరసి అర్చన అలియాస్ వేద. ‘నేను’ చిత్రంతో తెలుగు తెరపైకొచ్చిన ఈ తెలుగమ్మాయి... అనతికాలంలోనే యువతరం అభిమాన తారగా ఎదిగారు. పరభాషా నాయికల ప్రవాహంలో కొట్టుకుపోకుండా... ఎప్పటికప్పుడు, ఏదో ఒక పాత్రతో ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నారు. నేడు వేద పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’ జరిపిన సంభాషణ. తెలుగమ్మాయి అవడం వల్లే అవకాశాలు తక్కువగా వస్తున్నాయా? నేను బిజీగా లేనని ఎవరన్నారు? కెరీర్ మొదలైనప్పట్నుంచీ ఏనాడూ ఖాళీగా లేను. ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్నాను. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు, కన్నడంలో పునీత్‌రాజ్‌కుమార్ సరసన ఓ సినిమా చేస్తున్నాను. రీసెంట్గా నేను నటించిన ‘కమలతో నా ప్రయాణం’ చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవానికి ఎంపికైంది. పురస్కారాలు కూడా వస్తాయని ఆశిస్తున్నాను. నటిగా విభిన్నమైన పాత్రలు చేసే అవకాశాలు నాకొస్తున్నందుకు ఎప్పటికప్పుడు సంతోషిస్తూనే ఉంటాను. పరిశ్రమలో ఎవరికుండాల్సిన అవకాశాలు వారికుంటాయి. ఇక్కడ మనం వారిని పరభాష నాయికలంటాం. మరి నేను తమిళంలో, కన్నడంలో చేస్తున్నాను. వాళ్లకు పరభాషా నాయికనేగా? కళాకారులకు ప్రాంతంతో పని ఉండదు. సినిమా కోసమే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారా? మా అమ్మ నాకు నడకతో పాటు నాట్యం కూడా నేర్పింది. నా రెండో ఏటే నాట్యం నా జీవితంలోకి ప్రవేశించింది. అమ్మ కూడా నర్తకి. పేరు విజయశాస్త్రి. చిన్నప్పట్నుంచీ అమ్మ నాట్యాన్ని చూస్తుండేదాన్ని. చూసి చేసేదాన్ని. నాలోని జిజ్ఞాసను గమనించి పసి ప్రాయం నుంచే నాట్యాన్ని నేర్పించడం మొదలుపెట్టింది అమ్మ. సాగరసంగమం, స్వర్ణకమలం లాంటి చిత్రాలు ఇప్పుడు రావడం లేదు. ఏమైనా బాధ ఉందా? ఎందుకుండదండీ... అసలు అలాంటి పాత్రలు దొరికితే... నేనేంటో చూపిస్తా. నా చిరకాల వాంఛ అది. నటిగా గుర్తుండిపోయిన సందర్భాలు? కె.రాఘవేంద్రరావుగారి ‘శ్రీరామదాసు’లో సీత పాత్ర నాకెంతో పేరు తెచ్చింది. రాజమౌళిగారి ‘యమదొంగ’లో ఓ పాట చేశాను. అలాంటి లెజెండ్స్ సినిమాల్లో నటించినా నాకింకా తృప్తి తీరలేదు. వారి దర్శకత్వంలో పూర్తిస్థాయి సినిమాల్లో నటించాలనుంది. కథానాయికలపై వచ్చే రూమర్లపై మీ స్పందన? బాలీవుడ్లో ఇలాంటివి ఎక్కువ. అక్కడ హీరోలకు దీటుగా హీరోయిన్లకూ ఇమేజ్ ఉంటుంది కాబట్టి, ప్రతి దానికీ వారు ధైర్యంగా స్పందిస్తారు. కానీ ఇక్కడ హీరోల డామినేషన్. అందుకే... కథానాయికలు అంతగా స్పందించరు. ఇక నా విషయానికొస్తే... అలాంటి విషయాలకు నేను దూరం. నాకు పనే ముఖ్యం. నేను వర్క్‌హాలిక్. 24 గంటలు పని చేసిన రోజులున్నాయి. మన పని మనం చేసుకుంటున్నంత వరకూ మనపై ఎలాంటి అసత్య ప్రచారాలు రావని నా నమ్మకం. ఇంతకూ మీ పెళ్లెప్పుడు? ఏమో... నేను ఏదీ ప్లాన్ చేసుకోను. ఏటైమ్‌లో జరగాల్సింది ఆ టైమ్‌లో జరుగుతుంది... అంతే. ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? ఆ రెండు విధానాలపై నమ్మకం ఉంది. ప్రేమించినా, పెద్దల అంగీకారంతో చేసుకునే పెళ్లిలోనే కిక్ ఉంటుంది. ఇంతకీ అబ్బాయి తారసపడ్డాడా? లేదండీ... రాసిపెట్టి ఉన్నప్పుడు రాకపోతాడా (నవ్వుతూ).