సాక్షి, బోథ్: తెలంగాణలో ఉదయం 10గంటల తర్వాత లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి. ఇక వివాహ కార్యక్రమల్లో లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయితే తాజాగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో శనివారం జరిగిన ఓ పెళ్లిలో వధూవరులు పూలదండలు కాకుండా మాస్కులతో తయారు చేసిన దండలు వేసుకున్నారు. ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలు, మాస్కు ప్రాధాన్యత అందరికీ తెలియాలని ఇలా చేసినట్లు వధూవరులు సాయి సృజన, రవికాంత్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment