
దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికి వైరస్ తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గలేదు. అందుకే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పటికీ మాస్క్ ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే, చాలా చోట్ల జనాలు కరోనా నిబంధనలను గాలికి వదిలేస్తున్న సంఘటనలు ప్రతిరోజు వార్తల్లో చూస్తునే ఉన్నాం. అయితే, ఇక్కడో కోతి మాత్రం తాను మూతికి మాస్క్ ధరిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది. కాగా, ఇక్కడ కోతి చేష్టలు ఫన్నీగా ఉన్నా.. అది ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
దీనిలో రోడ్డుపక్కన కోతుల గుంపు ఉంది. దానిలో ఒక కోతి రోడ్డుపై పడి ఉన్న నలుపు రంగు మాస్క్‌ను తీసుకుంది. దాన్ని చేతిలో తీసుకుని అటూ ఇటూ తిప్పి చూసింది. ఆ తర్వాత దాన్ని తన మొహనికి పెట్టుకుంది. అంతటితో ఆగకుండా అటు ఇటూ కాసేపు తిరిగింది. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు తెలియరాలేవు. కాగా, దీన్ని ఫ్రెడ్ షుల్ట్జ్ అనే ట్విటర్ యూజర్ తన అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘కొంత మంది మనుషుల కన్నా.. కోతులే నయం..’,‘కోతి భలే మాస్క్ వేసుకుంది..’,‘ఇప్పటికైన కరోనా నియమాలు పాటించండి’అంటూ కామెంట్‌లు చేస్తున్నారు.
చదవండి: Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో..
Comments
Please login to add a commentAdd a comment