చెన్నై: కాంచీపురం జిల్లా ఉత్తరమేరూరులో ఓ పాఠశాల విద్యార్థి తరగతి గదిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే అతని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం అందించారు. తల్లిదండ్రులు బాలుడిని ఉత్తర మేరూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ నాసల్ మాస్క్‌ను అమర్చాలని సూచించారు.
వార్డులో చేర్చి మాస్క్ ధరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మాస్క్ లేకపోవడంతో టీ కప్పుకు రంధ్రం చేసి ఆక్సిజన్ సిలిండర్ నుంచి ట్యూబ్‌కు కనెక్ట్ చేసి విద్యార్థి చేతికి ఇచ్చి ముక్కుపై పెట్టారు. ఇది చూసిన ఓ రోగి సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో ఉంచాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ దృష్టికి వెళ్లింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్‌ను విచారణకు ఆదేశించారు.
చదవండి వాహనదారులకు అలర్ట్.. ఇక ఆగక్కర్లేదు,కొత్త టోల్ వ్యవస్థ రాబోతోంది
Comments
Please login to add a commentAdd a comment