
కరోనా రోగులు ఇలా పగటి పూట ఊరవతల ఉన్న రావి చెట్టు కింద ఉంటున్నారు. రాత్రి కాగానే ఇళ్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదుల్లో పడుకుంటున్నారు.
ఈ చిత్రంలో ఉన్నవారిని చూస్తే ఏదో పొలం పనులు చేయించడానికి వచ్చి సేద తీరేందుకు ఇలా కూర్చున్నట్లుంది కదా.. కానీ కాదు, వారు కరోనా బాధితులు. అలా అని వారిని ఎవరూ ఊరి బయటే ఉండమని ఆజ్ఞాపించలేదు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో కరోనా రోగులు ఇలా పగటి పూట ఊరవతల ఉన్న రావి చెట్టు కింద ఉంటున్నారు. రాత్రి కాగానే ఇళ్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదుల్లో పడుకుంటున్నారు. కరోనా రోగుల్లో సాంగిడి సర్పంచ్, వార్డు సభ్యులూ ఉన్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
నిజామాబాద్ అర్బన్: మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు మున్సిపల్ కార్మికుడిపై తండ్రీ కొడుకులు దాడికి దిగారు. నిజామాబాద్‌లోని గౌతంనగర్‌లో శనివారం చెత్త సేకరణకు వచ్చిన వాహనం వద్దకు ఫయాజ్ చెత్త తీసుకువచ్చాడు. మాస్క్‌పెట్టుకుని చెత్త డబ్బా ఇవ్వాలని ఫయాజ్‌ను కార్మికుడు యాదగిరి కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఫయాజ్ కార్మికుడిపై ఇనుప వస్తువుతో దాడికి దిగాడు. ఫయాజ్ తండ్రి సోపి సైతం దాడికి దిగినట్లు యాదగిరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తల్లి అంత్యక్రియలకు ముందుకురాని కూతురు
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధి రాజిపేటలో ఓ వృద్ధురాలు (75) కరో నాతో శనివారం మృతి చెందింది. స్థానికంగా ఉండే ఆమె ఏకైక కుమార్తెకు విషయం తెలిసినా రాకపోగా మిగతా బంధువులూ స్పందించలేదు. దీంతో కౌన్సి లర్ దామెర మొగిలి మున్సిపల్ సిబ్బంది సాయం తో మృతదేహాన్ని ఖననం చేయించారు. పీపీఈ కిట్లు ధరించి వృద్ధురాలి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో శ్మశాన వాటికకు తరలించి ఖననం చేశారు.