సిమ్లా: కరోనా వ్యాప్తి కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమాలు తెచ్చినా.. కొందరు జనాలు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నియమాలు ఉల్లంఘించేవారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారని తక్షణమే అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సిర్మౌర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. ‘బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్క్ లేకుండా కనబడితే.. వారెంట్‌తో సంబంధం లేకుండా వారిని అరెస్ట్ చేస్తాం. ఇక నేరం రుజువైతే వారికి ఎనిమిది రోజుల జైలు శిక్షతోపాటు ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధిస్తాం’ అని తెలిపారు. ఇక కరోనా కట్టడి కోసం ప్రజలంతా తప్పక మాస్క్ ధరించాల్సిందిగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ముఖ్యంగా బహిరంగా ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పని సరి చేశాయి. తాజాగా ఢిల్లీలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దాంతో మాస్క్ ధరించని వారికి 500-5,000 రూపాయల వరకు చలాన్‌లు విధిస్తుంది. అలానే ఢిల్లీ పరిపాలన అధికారులు నగరం అంతటా తనిఖీని ముమ్మరం చేశారు. (చదవండి: ఊరంతా కరోనా.. అతడికి తప్ప)
చాలా చోట్ల, సివిల్ డిఫెన్స్ సిబ్బందికి, మాస్క్ ధరించని ప్రజలకు మధ్య తరచుగా గొడవలు జరగడం చూస్తూనే ఉన్నాం. కరోనావైరస్ నియంత్రణకు గాను రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎనిమిది జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించింది. జైపూర్, జోధ్పూర్, కోటా, బికానెర్, ఉదయ్‌పూర్, అజ్మీర్, అల్వార్, భిల్వారా పట్టణ ప్రాంతాల్లోని మార్కెట్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సంస్థలు రాత్రి 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment