బతికున్నవారితో సరదాలు.. సరసాలు సహజం. శవంతో సరసాలేంటి? కొందరు ప్రబుద్ధులంతే. శవమైనా తమ సరదాలు తీర్చుకోవడానికి వెనకాడరు. లీల అనే ఓ సినిమా ఆర్టిస్టు డెడ్‌బాడీని ఓసారి శవాలగదికి తీసుకొస్తారు. అక్కడ పనిచేసే ఒకడు తన ఇద్దరు స్నేహితులను ఆ గదికి తీసుకొచ్చి లీల శవాన్ని చూపిస్తాడు. వారిలో ఒకడు ఆమె శవంతో సరసాలు ఆడదామని మిగిలిన స్నేహితులనూ ఒప్పిస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు లీల ఎలా చనిపోయింది? హత్య చేశారా? ఆత్మహత్య చేసుకుందా? ఈ విషయాలతో తెరకెక్కిన చిత్రం ‘దేవిశ్రీ ప్రసాద్’.
పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, మనోజ్ నందం ప్రధాన పాత్రల్లో శ్రీకిషోర్ దర్శకత్వంలో డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించారు. కమ్రాన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను నటుడు శివ బాలాజీ, నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. ‘‘ఈ సినిమా ఇంత బాగా రావడానికి ధనరాజ్ కారణం. ఈ కథ చాలామందికి చెప్పినా నచ్చలేదు. పూజా రామచంద్రన్‌కి నచ్చి, చేశారు’’ అన్నారు శ్రీకిషోర్. ‘‘మంచి సినిమా చేయాలనే ప్రయత్నంతో చేసిన చిత్రమిది. అభ్యంతరకర సన్నివేశాలుండవు’’ అన్నారు నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment