దేవిశ్రీ ఫిక్స్‌.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు పండ‌గే | Harish Shankar Announced Devisri As The Music Director Pawan Telugu Movie | Sakshi

దేవిశ్రీ ఫిక్స్‌.. ప్ర‌క‌టించిన క్రేజీ డైరెక్ట‌ర్‌

Published Tue, May 12 2020 9:23 AM | Last Updated on Tue, May 12 2020 11:14 AM

Harish Shankar Announced Devisri As The Music Director Pawan Telugu Movie - Sakshi

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్- రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'జ‌ల్సా, గ‌బ్బ‌ర్ సింగ్, స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌, అత్తారింటికి దారేది చిత్రాలు మ్యూజిక‌ల్‌గా ఎంత హిట్ సాదించాయే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సంగీత అభిమానుల‌తో పాటు టాలీవుడ్ ఎంతో ఆస‌క్తిగా వీరి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రావాల‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అయితే ప‌వ‌న్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన గ‌బ్బ‌ర్ సింగ్ విడుద‌లై నిన్న‌టికి ఎనిమిదేళ్లు పూర్త‌యింది. ఈ సంద‌ర్బంగా ఆనాటి మ‌ధురస్మ్రుతుల‌ను గుర్తు చేసుకుంటూ డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్ ఓ ఆస‌క్త‌కిర‌మైన ట్వీట్ చేశాడు. అంతేకాకుండా త‌న త‌రువాతి సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను కూడా అభిమానుల‌తో పంచుకున్నాడు. 

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌తో మరో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న హ‌రీష్ శంక‌ర్.. ప‌వ‌ర్‌స్టార్‌తో ఓ చిత్రం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిచ‌నున్నాడు. ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ హ‌రీష్ స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ ప‌వ‌న్ 28వ చిత్రానికి దేవిశ్రీనే మ్యూజిక్ అందించ‌నున్నాడ‌ని ఈ క్రేజీ డైరెక్ట‌ర్ ప్ర‌క‌టించాడు. దీంతో హ‌రీష్‌-ప‌వ‌న్‌-దేవిశ్రీ కాంబినేష‌న్‌లో రాబోయే చిత్రం గ‌‌బ్బ‌ర్ సింగ్‌కు మించి ఉండాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీల్ సాబ్ చిత్రం విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఈ చిత్రం త‌ర్వాత క్రిష్ డైరెక్ష‌న్‌లో విరూపాక్ష (ప్ర‌చారంలో ఉన్న టైటిల్‌) చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇక ద‌ర్శ‌కుడు హ‌రీష్ ప్ర‌స్తుతం ప‌వ‌న్ సినిమా కోసం ప‌వ‌ర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు. 

చ‌ద‌వండి:
దిల్ వాకిట్లో తేజ‌స్విని

కాబోయే తల్లికి శుభాకాంక్షలు!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement