
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ది రియల్ మ్యాన్’ చాలెంజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఇంటి పనుల్లో ఆడవాళ్లకు సాయం చేయడం ద్వారా ఈ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. తాజాగా దర్శకుడు సుకుమార్ నుంచి ఈ చాలెంజ్‌ను స్వీకరించిన.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంటి పనుల్లో తన తల్లికి సాయం అందించాడు. ఇంటిని శుభ్రం చేయడంతో పాటుగా తన తల్లికి అమ్లెట్ వేసి పెట్టాడు. అంతేకాకుండా ప్లేట్ కూడా శుభ్రం చేశాడు. చివరిగా తన తండ్రి ఫొటో వద్ద నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డీఎస్పీ.. మనల్ని రియల్ మ్యాన్‌గా తయారు చేస్తున్న ప్రతి ఒక్క తల్లికి దీనిని అంకితం ఇస్తున్నట్టుగా చెప్పారు.
అలాగే ఈ చాలెంజ్‌ను ముందకు తీసుకెళ్లాల్సిందిగా హీరోలు అల్లు అర్జున్, యష్, కార్తి, దర్శకుడు హరీష్ శంకర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ను డీఎస్పీ కోరారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, దర్శకులు ఎస్‌ఎస్ రాజమౌళి, సందీప్‌రెడ్డి వంగల మాదిరి వినోదాన్ని జోడించే ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వీడియోలో తొలుత బి ది రియల్ మ్యాన్ చాలెంజ్ చేసిన సినీ ప్రముఖల క్లిప్స్ చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment