
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'పుష్ప2'. ఈ చిత్రం సాంగ్స్, ట్రైలర్, కలెక్షన్స్ ఇలా అన్నింటిలోనూ పలు రికార్డ్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి పీలింగ్స్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. సోషల్‌మీడియాలో ఈ పాట సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్ కూడా ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి.
పుష్ప2 విజయంలో పాటలు కూడా ప్రధాన బలమని చెప్పవచ్చు. అల్లు అర్జున్, రష్మిక మందన్న స్టెప్పులకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పుష్ప2లో భారీ క్రేజ్‌ను అందుకున్న పీలింగ్స్ సాంగ్ వీడియో అన్ని భాషలలో రిలీజ్ కావడంతో యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది.
విడుదలైన రోజు నుంచే 'పీలింగ్స్' సాంగ్ దూసుకుపోతోంది. ఈ పాటను చంద్రబోస్ రచించగా తెలుగులో (శంకర్ బాబు, లక్ష్మీ దాసా), హిందీలో (జావేద్ అలీ, మధుబంతీ) , తమిళంలో (సెంథిల్ గణేశ్, రాజలక్ష్మి) మలయాళంలో (ప్రణవమ్ శశి, సితార కృష్ణకుమార్) కన్నడలో (సంతోశ్ వెంకీ, అమల) ఆలపించారు.
Comments
Please login to add a commentAdd a comment