'నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు మా నాన్న సత్యమూర్తి గారికి థాంక్స్' అని మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ అన్నారు. 'ప్రతి ఫంక్షన్కి మా నాన్నని తీసుకు వచ్చే వాడిని. మా సక్సెస్ని మా నాన్నగారు చూసేలా చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా థాంక్స్. సామాజిక మాధ్య మాల్లో నాన్న మరణించిన సమయంలో(ఫేస్ బుక్, ట్విట్టర్) సపోర్ట్ చేసి వారికి కృతజ్ఞతలు' అని నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్లో దేవి శ్రీ ప్రసాద్ అన్నారు.
నీ తోటి టెక్నిషియన్ వర్క్ను మనస్పూర్తిగా అప్రిషియేట్ చేయాలని మా నాన్న నాకు చెప్పిన మాటలే.. నన్ను ఈ రోజు ఈ స్థానంలో నిలిపేలా చేసిందన్నారు. ఈ చిత్రానికి 'నాన్నకు ప్రేమతో' టైటిల్ రావడం నా అదృష్టం. మైండ్ క్లియర్గా ఉంటేనే సక్సెస్ వస్తుంది. మా నాన్న హార్ట్ ప్రాబలమ్ ఉన్నా ఎప్పుడూ నవ్వుతూనే ఉండే వారు. నాన్న ఆస్పత్రిలో ఉన్నప్పుడూ, ఒక్క రోజు కూడా నన్ను ఆస్పత్రికి రానివ్వకుండా తమ్ముడు సాగర్, అమ్మ నాన్నను జాగ్రత్తగా చూసుకున్నారు. నా పాటలకు మీరు కొట్టే క్లాప్స్ విని మా నాన్న గారి కళ్లలో నీళ్లు వచ్చేవి. ఈ ఆడియో ఫంక్షన్ ని మానాన్నకి అంకితం చేయడం చాలా ఆనందంగా ఉంది అని దేవి అన్నారు.
మొదటి సారి దేవి కళ్లలో నీళ్లు చూశా..
ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్వించే దేవీ కళ్లలో నీళ్లని మొదటిసారి సత్యమూర్తిగారు మృతి చెందిన తర్వతే చూశాను అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. ఈ సంఘటన తర్వాత మూడో రోజే తిరిగి తన పనిలో దేవీ నిమగ్నమయ్యారన్నారు.
నాన్నకు థాంక్స్: దేవీ శ్రీ ప్రసాద్
Published Sun, Dec 27 2015 11:15 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM
Advertisement
Advertisement