బాలయ్య సినిమా పేరు ‘సామ్రాట్’ కాదా?
ఇమేజ్‌కి తగ్గట్టుగా హీరోలను ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు బోయపాటి శ్రీను దిట్ట. ‘సింహా’లో బాలకృష్ణను ఆయన తెరపై ఆవిష్కరించిన తీరుకు జనాలు ఫుల్ ఖుష్ అయిపోయారనే చెప్పాలి.
ఇమేజ్‌కి తగ్గట్టుగా హీరోలను ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు బోయపాటి శ్రీను దిట్ట. ‘సింహా’లో బాలకృష్ణను ఆయన తెరపై ఆవిష్కరించిన తీరుకు జనాలు ఫుల్ ఖుష్ అయిపోయారనే చెప్పాలి. శారీరక భాష, సంభాషణలు పలికే తీరు... ఇలా ప్రతి విషయంలో బాలయ్య అందులో కొత్తగా కనిపించారు. మళ్లీ వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ‘దూకుడు’ లాంటి బ్లాక్‌బస్టర్‌ని ప్రేక్షకులకు అందించిన నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం.
బాలకృష్ణకున్న శక్తిమంతమైన మాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాతలు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. బాలయ్య రాజకీయ జీవితానికి బలమైన పునాది వేసేలా ఈ సినిమా ఉండబోతుందని మీడియా వర్గాల భోగట్టా. అందుకు తగ్గట్టుగానే బోయపాటి శక్తిమంతంగా బాలయ్య పాత్రను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. జగపతిబాబు ఇందులో ప్రతినాయకుని పాత్ర పోషించడం విశేషం. ఆయనకు జంటగా ఇందులో కల్యాణి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ నానక్‌రామ్‌గూడా రామానాయుడు సినీ విలేజ్‌లో జరుగుతోంది.
బాలకృష్ణ, జగపతిబాబు, కల్యాణిలపై కీలక సన్నివేశాలను బోయపాటి చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సామ్రాట్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే... అందులో ఏ మాత్రం నిజం లేదనేది విశ్వసనీయ సమాచారం. త్వరలోనే టైటిల్‌ని నిర్ణయిస్తారట. సోనాలీ చౌహాన్ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది.