DSP Musical Wishes: Devi Sri Prasad Shared New Year Special Song - Sakshi
Sakshi News home page

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్‌ విషెస్‌

Published Thu, Dec 31 2020 8:22 PM | Last Updated on Fri, Jan 1 2021 9:49 AM

Happy Musical New Year Everyone : Devi Sri Prasad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ టాలీవుడ్‌ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ న్యూ ఇయర్‌ సందర్భంగా మ్యూజికల్‌ న్యూఇయర్‌ శుభాకాంక్షలతో ఒక వీడియోను షేర్‌ చేశారు. ఈ సందర‍్భంగా తనకెంతో ఇష్టమైన వాయిద్యం సితార్‌ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ సితార్‌ ప్లేయర్‌ కిషోర్‌ను  పరిచయం చేశారు.  అప్‌ కమింగ్‌ మూవీ రంగ్‌దే లోని సాంగ్‌ను కిషోర్‌ ప్లే చేసిన వీడియోను షేర్‌ చేస్తూ అభిమానులకు మ్యూజికల్‌ విషెస్‌ అందించారు. అందమైన సంగీత నూతన సంవత్సరంలో  అద్భుతమైన ఆశలు, పప్రేమతో రంగులమయం కావాలంటూ ఆకాంక్షించారు.

అలాగే ఈ సాంగ్‌ను రేపు(జనవరి 1, శుక్రవారం) విడుదల చేయనున్నట్టు డీఎస్‌పీ తెలిపారు. కాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కీర్తీ సురేష్‌ జంటగా నటిస్తున్న రంగ్‌దే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఒక రొమాంటిక్ మ్యాజిక‌ల్ మెలోడీ సాంగ్‌ను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement